TV77తెలుగు రాజమహేంద్రవరం:
కేంద్ర ప్రభుత్వ ఆయుష్ విభాగం మరియు ఆరోగ్య విభాగం నుండి వచ్చిన ఆదేశానుసారం 18 సంవత్సరాల లోపు ఉన్న విద్యార్థులకు కోవిడ్ టీకా కోవ్యాక్సిన్ ఈరోజు రాజమహేంద్రి మహిళా కళాశాలలో విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య సిబ్బంది కళాశాలకు వచ్చి టీకానీ విద్యార్థినులకు వేసినారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సత్య సౌందర్య పాల్గొని విద్యార్థులతో మాట్లాడుతూ వ్యాక్సిన్ ప్రతి ఒక్క స్టూడెంట్ వేయించుకోవాలని వేయించుకున్న తర్వాత ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను విద్యార్థులకు వివరించారు. అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ నుండి డాక్టర్ రాణి, మెడికల్ ఆఫీసర్, పాల్గొని విద్యార్థులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ టీకాను ఉచితంగా 18 సంవత్సరాల లోపు విద్యార్థులకు వేస్తున్నారని టికా వేయించుకున్న వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఒకవేళ ఏదైనా కొద్దిగా జ్వరం వస్తే dolo 650 టాబ్లెట్ వేసుకోవాలి తెలియజేసినారు. ఎంఆర్పి నాగలక్ష్మి పాల్గొని విద్యార్థులతో మాట్లాడుతూ సోమవారం కళాశాలకు రానివారు మంగళవారం కూడా వచ్చి ఈ టికాని వేయించుకోవచ్చు అని చెబుతూ టీక వేయించుకున్న ప్రతి ఒక్కరికి వెబ్సైట్ నుంచి టీక వేయించుకున్న వాళ్ళు పీక వేయించుకున్న అట్లు ధ్రువీకరణ పత్రం డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఏ.ఎన్.ఎం. దుర్గ, ఆశ వర్కర్ జ్యోతి, రాజమహేంద్రి మహిళా కళాశాల ఎన్.ఎస్.ఎస్ పీ.వోలు లక్ష్మీ ప్రవీణ, ఎం. కె.ఎస్ ప్రసాదు మరియు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.