TV77తెలుగు ఇబ్రహీంపట్నం :
ఫీజుల పేరుతో విద్యార్థుల భవిష్యత్ తో చెలగాటమా..??
ఫీజు చెల్లించ లేదని విద్యార్థులను బయట నిలబెట్టి ఏడిపిస్తున్న పాఠశాల యాజమాన్యాలు...!!!
ఇబ్రహీంపట్నం సెయింట్ జేవియర్స్ పాఠశాల యాజమాన్యం అత్యుత్సాహం....!!
అందరి పిల్లలకు పరీక్షలు నిర్వహించి ఫీజు కట్టని పిల్లవాడిని బయటకు నెట్టేసిన స్కూల్ టీచర్స్....!!
మనస్థాపం తో ఇంటికి వచ్చిన పిల్లాడు బాధ చూసి తల్లడిల్లిన తల్లి....!!!
చదువు లో 15 కి 15 మార్కులు తెచ్చుకుంటున్నాడు. కానీ ప్రవేటు పాఠశాల యాజమాన్యాల అత్యుత్సాహం కారణంగా మనస్థాపం తో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి.ఇబ్రహీంపట్నం సెయింట్ జేవియర్ పాఠశాల ఉపాధ్యాయుల నిరంకుశ వైఖరికి నిదర్శనం ఈ చర్య. ఫీజు చెల్లించాలని నెపం తో విద్యార్థిని పరీక్ష రాయనీకుండా అందరి విద్యార్థుల ముందు బయట నెట్టివేయడం తో పాపం ఆ పసి మనసులు తల్లడిల్లి పోయాయి. తన తోటి విద్యార్థుల ముందు చిన్న బోయిన ఆ పసి మనసు జరిగింది ఇంటికి వచ్చి చెప్పడం తో తల్లడిల్లి పోయిన తల్లి , తండ్రి అప్పు చేసి మరీ 10 వేల రూపాయలు జమ చేయడానికి వెళ్ళారు. అలా వెళ్లిన వారికి స్కూల్ యాజమాన్యం మరో డిమాండ్ వారి ముందు పెట్టారు. 10 వెలు కాదు మొత్తం ఫీజు చెల్లిస్తేనే పరీక్ష రాయానిస్తామ్ అని హుకూం జారీ చేశారు. దీంతో ఆ తల్లికి ఎం చేయాలో తెలీక మళ్ళీ ఆ పిల్ల వాడిని తీసుకొని ఇంటికి వచ్చింది. వేలల్లో ఫీజులు వసూలు చేస్తూ.విద్యార్థులను ఏడిపిస్తున్న స్కూల్ యాజమాన్యాలు అసలు నిభందనల ప్రకారం పాఠశాలలు నడిపిస్తున్నాయా, చిన్న పిల్లలను సైతం రెండు మూడు ఫ్లోర్ లు ఎక్కించి , పుస్తకాల పేరుతో వేలల్లో వసూల్ చేస్తున్న ప్రవేటు పాఠశాల యాజమాన్యాల పై ప్రభుత్వ చర్యలు తూ తూ మంత్రంగానే మిగిలిపోయాయా. కనీస వసతులు లేకపోయినా వేలల్లో ఫీజులు ఎందుకు వసూల్ చేస్తున్నారు.. ఫీజుల పేరుతో విద్యార్థుల భవిష్యత్ తో ఆటలు ఆడుతుంటే విద్యా శాఖ వేడుక చూస్తోందా..?ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తున్న ఇబ్రహీంపట్నం సెయింట్ జేవియార్ పాఠాశాల నిర్వహణ పై మరో కథనం..
సత్య..రిపోర్టర్, మైలవరం