ఆర్టీసీ బస్సు..ఆటో.. ఢీ


  TV77తెలుగు చింతపల్లి :

రోడ్డు ప్రమాదంలో ఎస్సై సహా ఆయన తండ్రి మృతి చెందారు. ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఈప్రమాదం జరిగింది. చింతపల్లి మండలం మాల్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. మృతులను ఎస్సై నేనావత్ శ్రీను నాయక్, ఆయన తండ్రిగా గుర్తించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఎస్సై శ్రీను నాయక్‌కి వారం రోజుల కిందటే వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ఎస్సై శ్రీనుది రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం మాన్య తండా. ఓ ఫంక్షన్‌కి హాజరై తిరిగి వస్తుండగా హైదరాబాద్ నుంచి దేవరకొండ వెళ్తున్న ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జైంది. ఎస్సై, ఆయన తండ్రి స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. మరొకరి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.