TV77తెలుగు కొయ్యలగూడెం :
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగనన్న ప్రభుత్వం లో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు పెద్దపీట వేశారని మహిళా నాయకురాలు నిడదవోలు రాజ్యలక్ష్మి అన్నారు రెండవ వైస్ ఎంపీపీ బీసీ మహిళలకు కేటాయించి చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పాలన కొనసాగిస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలు ప్రతి గడపగడపకు అందేలా కృషి చేస్తున్న ముఖ్యమంత్రికి రాష్ట్ర మహిళలందరూ కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆమె అన్నారు. అంతేకాకుండా రాష్ట్ర చరిత్రలో వైయస్ జగన్మోహన్ రెడ్డి చిరస్థాయిగా నిలిచిపోతారని ఆమె జోస్యం చెప్పారు. పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు నాయకత్వంలో కొయ్యలగూడెం మండలం లో రానున్న రోజుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తిరుగులేని మెజారిటీ బాలరాజు కి అందిస్తామని రాజ్యలక్ష్మి తెలిపారు.