బిసిల పట్ల ఇంత కక్ష ఎందుకు? బుద్దా వెంకన్న అరెస్టు దుర్మార్గం..! కాశి నవీన్ కుమార్


 TV77తెలుగు  రాజమహేంద్రవరం : 

అధికారం చేపట్టిన నాటి నుండి ఇప్పటివరకు ఎస్సీలపై దాడులు చేసిన వైసీపి సర్కార్ ఇప్పుడు బిసి నేతలను టార్గెట్ చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్ కుమార్ అన్నారు. టిడిపి నేత బుద్దా వెంకన్న అక్రమ అరెస్టును ఆయన ఖండించారు. ప్రభుత్వ అసమర్థత, అవినీతిని ప్రశ్నించినా,గళమెత్తినా అక్రమ అరెస్టులు చేయిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.2019లో ఎన్నికలు జరిగిన నాటి నుండి నేటి వరకు ఎక్కడా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాక జరగడం లేదని,రాక్షస పాలన ఏ విధంగా ఉంటుందో నేడు కళ్ళారా చూస్తున్నామని అన్నారు.రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించిన ప్రజాస్వామ్య వ్యవస్థను జగన్ సర్కార్ తుంగలోకి తొక్కుతుందని మండిపడ్డారు.ఎస్సీ, బిసిల ఓట్లతో గద్దెనెక్కిన జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఎస్సీ,బిసిలే టార్గెట్ గా పరిపాలిస్తున్నారని మండిపడ్డారు.అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఎస్సీ,బిసిలకు వైసిపి ప్రభుత్వం ఏమి చేసిందని ప్రశ్నించారు.నామమాత్రంగా పదవులు వేసినంత మాత్రాన బిసిలను ఉద్దదరించినట్లు కాదని నవీన్ అన్నారు. ఎవరి ఓట్లతో గద్దెనెక్కారో వారి ఓట్లతోనే కిందకు దిగే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.