TV77తెలుగు కొండపల్లి :
కొండపల్లి కొత్తగేట్ లో బిడ్డను ఎత్తుకెళ్లారు అంటూ ఫేక్ ప్రచారం....!!!
పోలీసుల రంగ ప్రవేశం తో వెలుగులోకి వచ్చిన విస్తుపోయే విషయాలు...!!
తనకు గర్భిణీ ఉందంటూ కడుపు చుట్టూ గుడ్డలు చుట్టుకొని స్థానికులను నమ్మించిన ఒక మహిళ నాటకీయ పరిణామాలకు తెర తీసింది. అయితే తీరా డెలివరీ సమయం వచ్చింది అంటూ మరో పెద్ద డ్రామా కు ఆద్యం పోసి పోలీసులను ముప్ప తిప్పలు పెట్టింది. అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ హైడ్రామా తో పోలీసులు అప్రమత్తం అయ్యారు. సేకరించిన సమాచారం మేరకు కొత్త గేట్ లో నివాసముంటున్న ఒక మహిళ గర్భం నెపం తో పుట్టింట్లో ఉంటోంది.. అయితే స్థానికులను నమ్మించడం కోసం కడుపు చుట్టూ గుడ్డలు కట్టుకొని తనకు నెలలు నిండాయని నమ్మించ సాగింది.. ఈ క్రమం లో నెలలు నిండే సమయం రావడం తో తన గర్భం ఫేక్ అని తెలిసిపోతుందని గ్రహించిన మహిళ మరో హై డ్రామాకు తెర తీసింది. అర్ధరాత్రి ఒక మహిళ, ఇద్దరు మగవారు వచ్చి తనకు డెలివరీ చేసి శిశువును ఎత్తుకువెల్లినట్లు ఆ మహిళ చెప్పినట్లు ప్రచారం జరిగింది. దీంతో ఒకసారిగా కొత్త గేట్ ప్రాంతం లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు అసలు గుట్టు బట్టబయలు చేశారు... అయితే ఇంత హై డ్రామా ఎందుకు ఆడినట్లు ఆరా తీయగా తనకు పిల్లలు పుట్టలేదని అందరూ గొడ్రాలు అంటున్నారు అనే మనస్తాపం తో ఇదంతా చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణ లో తేలినట్లు సమాచారం.ఈ మొత్తం వ్యవహారంలో మహిళ అనుసరించిన తీరు పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి.ఎంత కష్టం వచ్చినా ఇలాంటి పనులు చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు..ఉదయం నుండి జరిగిన ప్రచారానికి పోలీసులు బ్రేకులు వేయడం తో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
సత్య...రిపోర్టర్
మైలవరం