TV77తెలుగు ఇబ్రహీంపట్నం :
చైతన్య వంతమైన సమాజమా తల దించుకో....!!!
పేరుకే అభివృద్ధి చెందుతున్న ప్రాంతం.. కానీ చీకటి కోరల్లో చిక్కుకుని నలిగిపోతున్న పౌరుడి జీవనం...!!
మొద్దు నిద్దరపోతున్న ప్రజా ప్రతినిధులు, చొరవ చూపని విజ్ఞత లేని అధికారులు, నోరు మెదపని ప్రజా సంఘాలు, బలైపోతున్న అమాయక ప్రాణాలు....!!
ఇంకా ఎన్నాళ్ళు ఈ మరణ మృదగం, ఇంకా ఎన్ని రోజులు ఈ నిర్లక్ష్యం... ముగింపు లేదా ఈ నిర్లక్ష్యపు చీకటి చావులకు..!!
ప్రజా ప్రతినిదులు, రాజకీయ పార్టీల నేతలు పూజలు, యాగాలు చేసే పని లో బిజీ బిజీ....!!
ప్రజా సంఘాలు, ఉద్యమ శిఖరాలు తమ గళానికి పని చెప్పడం ఆపేశారు...!!
ఇక నీదే భాధ్యత...
ఇది నిజంగా సభ్య సమాజానికి సిగ్గు చేటు.. దిన దిన అభివృద్ధి చెందుతున్న ప్రాంతం దిన దిన గండం గా బ్రతకే దుస్థితి.. ఈ వైఫల్యానికి ఎవరు బాధ్యులు, అమాయక ప్రాణాలు బలిగొంటున్న చీకటి దారుల రక్త దాహానికి ముగింపు ఎప్పుడు, మనిషిని పోగొట్టుకున్న కుటుంబాల కన్నీటి ధారలు ఇంకా ఎన్నాళ్ళు... పగలు రాత్రి తేడా లేకుండా నిలువెత్తు నిర్లక్ష్యానికి విలువైన ప్రాణాలు బలై పోతుంటే కనీసం చీమ కుట్టినట్లు లేక పోవడం చూస్తుంటే మానవ విలువలు ప్రశ్నార్ధకంగా మారినట్లు కనిపిస్తోంది.. ఇంటి నుంచి నవ్వుతూ వెళ్లిన మనిషి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చే వరకు ఆ ప్రాణానికి గ్యారంటీ లేదు అన్నట్లు ఉంది జాతీయ రహదారుల దుస్థితి... ఇబ్రహీంపట్నం నుండి గొల్లపూడి వరకు, ఇబ్రహీంపట్నం నుండి జి కొండూరు వరకు రహదారులకు ఇరు వైపులా లైట్ల వెసులుబాటు ఉన్నపటికీ వాటిని వెలిగించే శక్తి మాత్రం ప్రభుత్వాలకు లేదు అన్నట్లు ఉంది.. చీకటి పడితే ఆ ప్రాంతాలు అడవిని మించి చీకట్లు కమ్మెస్తాయి.. ఆ చీకటి రహదారుల వెంబడి ప్రయాణించే వారు క్షేమంగా ఇంటికి వెళతారు అన్న నమ్మకం లేకుండా పోయింది.. ఇబ్రహీంపట్నం కొండపల్లి వెళ్ళే ప్రాంతం లో ప్రమాదాలు మృత్యు ఘంటికలు మోగిస్తున్నాయి.. కటిక చీకటి ప్రయాణం కావడం తో ఎదురు ఎవరు వస్తున్నారు, ఎవరు రోడ్డు దాటుతున్నారు అనేది నర మానవుడుకి కనిపించే పరిస్థితి లేదు... లైట్ల సౌకర్యం ఉన్నప్పటికీ అధికారుల మద్య సమన్వయ లోపం అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటోంది.. విద్యుత్ బాకాయిలు ఇతరత్రా కారణాలు సాకుగా చూపుతూ రహదారులను చీకటిమయం చేస్తున్నారు.. రహదారుల వెంబడి ఇటీవల కాలంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు, ముక్కు పచ్చలారని పసి మొగ్గలు, ఇంటికి పెద్ద దిక్కు ఇలా ఎందరో రాకాసి రహదారులకు బలై పోయారు.. అధికారుల నిలువెత్తు నిర్లక్ష్యాన్ని ప్రశ్నించే గొంతుకలు మూగబోయ్యాయి.. రహదారి వెంబడి లైట్ వెలిగించల్సిన ప్రభుత్వం సీత కన్ను వేసింది... ప్రమాదాల కారణం గా అమాయకులు బలై పోతుంటే ప్రజా ప్రతినిధులు చోద్యం చూస్తున్నారు.. ఏదైన ప్రజా సమస్య తలెత్తినప్పుడు ప్రశ్నించే ప్రజా సంఘాలు మొద్దు నిద్దర పోతున్నాయి.. రాజకీయంగా ఇక అధికార పార్టీ నేతలు, ప్రతి పక్షాలు వాళ్ళ వాళ్ళ నాయకులకు కరోనా వస్తె వారు త్వరగా కోలుకోవాలని పూజలు , యాగాలు, టెంకాయలు కొట్టే పనిలో బిజీ బిజీ గా ఉన్నారు.. ఇక సామాన్యుడు అవస్థలు ఎవడు పట్టించుకుంటారు, ఎవరు ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యలను పరిష్కరిస్తారు.. డాక్టర్ ఎన్టిటీపీస్ కు చెందిన ఉద్యోగులు సైతం రోడ్డు ప్రమాదాల కారణంగా అసువులు బాస్తున్న యాజమాన్యానికి కనీసం చలనం లేకపోవడం ఎంత దురదృష్టం... ప్రజా సమస్యల పరిష్కారానికి ఎవడో నాయకుడు వచ్చే రోజులు పోయాయి, ప్రజా సమస్యలు వినే ప్రజా సంఘాలు కాల గర్భం లో కలిసిపోయినట్లు ఉన్నాయి..ఇక చేయాల్సింది నువ్వే...నువ్వే...సామాన్యుడా మేలుకో, ప్రభుత్వం లో చలనం వచ్చే వరకు నీ గళం బలంగా వినిపించు... నీ కుటుంబ క్షేమం, నీ సమాజ క్షేమం నీ చేతుల్లోనే...మీ గళం మాకు వినిపించు మేము సమాజానికి వినిపిస్తాo....జర్నలిస్టుల ఐక్య వేదిక మీ గళం , మీ పిర్యాదు ప్రభుత్వానికి వినిపించేందుకు సిద్ధం గా ఉంది.... నువ్వు సిద్దమా..??? మీ పిర్యాదు మీ వీడియో రూపం లో 9441797914 వాట్స్ యాప్ చేయండి....
సత్య...రిపోర్టర్జ , జర్నలిస్టుల ఐక్య వేదిక..