రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూకు ఆదేశాలు


 TV77తెలుగు  అమరావతి :

కోవిడ్ కేసుల విజృంభణ నేపథ్యంలో ఏపీలో నైట్ కర్ప్యూ విధిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. రాత్రి గం.11 నుంచి ఉదయం గం.5 వరకు కర్ప్యూ అమల్లో ఉంటుంది. 50% ఆక్యుపెన్సీతో థియేటర్స్, మాల్స్ నడవాలన్నారు. ప్రార్ధనా మందిరాలలో కోవిడ్ ఆంక్షలు అమలు చేయాలని ఆదేశించారు. ఇక బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి  చేస్తునట్లు ఆదేశాల్లో వెల్లడించారు.