ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకోవటానికి ప్రపంచ ఆంధ్రులు ఏకం కావాలి.


 TV77 తెలుగు రాజమహేంద్రవరం :

నాటి ఆంధ్ర పౌరుషాన్ని, ఖ్యాతిని చాటుదాం. 

నేటి రాజకీయ మకిలిని కడిగేద్దాం. 

నూతన రాజకీయ చరిత్రను సృష్టిద్దాం. 

ఏపి ప్రగతికై ఉద్యమిద్దాం కదలి రండి ఆంధ్రులారా. 

దమ్మున్న ఆంధ్రుల ను గెలిపిద్దాం. ఆంధ్రప్రదేశ్ పై విషం కక్కుతున్న మోది సర్కార్ కు బుద్ది చెపుదాం అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్పిసి)ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పిసి వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ పిలుపు నిచ్చారు.నేటి పాలకుల దాష్టీకాలకు, అరాచకాలకు అవినీతి దోపిడీలకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కి నోచుకోలేకపోతుందని, అన్ని రంగాలు అడుగంటి పోతున్నాయని, అప్పులతో పాలకులు పాలన అసమర్ధతకు తార్కాణం అని,  ప్రజలు ఆకలితో గగ్గోలు పెడుతున్నారని, నేటి పాలకుల్లో ఏ ఒక్కరు అభివృద్ధి, సంక్షేమం, భద్రత, కనీస వసతులు, మౌలిక సదుపాయాలు కోసం ఆలోచించే వారు లేకపోవడం ఆంధ్రుల దురదృష్టం గా భావించాలని, నేటి పాలకులు ప్రజలను శునక జీవాలకన్నా హీనాతి హీనంగా చూస్తున్నారని, ప్రజా అవసరాలకు వెన్ను దన్నుగా నిలవాల్సిన నేతలు ప్రజలను మత్తుకు బానిసలుగా మారుస్తున్నారని, రాజకీయ స్వప్రయోజనాలకు ప్రజలను సోమరుల వలే తయారు చేస్తున్నారని, నేడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అగమ్య గోచరంగా వుందని, దొరికిన కాడికి దోచుకోవటమే పనిగా నేటి పాలకులు పాలన సాగిస్తున్నారని, నువ్వు దొంగ అంటే నువ్వే దొంగ అంటు విమర్శలు గుప్పించుకోవడం తప్ప సాధించినది సోధించినది ఏమి లేదని, ఆంధ్ర లో గొప్ప పాలకులు లేరని, ప్రస్తుత పాలకులకు వున్న   బలహీనతల కారణంగా పాలనకు అనర్హులుగా మిగులుతున్నారని, నేటి ఆంధ్రప్రదేశ్ లో సామాన్యులు నుండి బువ్వ పెట్టె రైతన్న వరకు రాక్షస పాలకుల కు బలిపశువులుగా మారుతున్నారని , కుల మత వర్గ ప్రాంతాలకు అతీతంగా ప్రపంచంలో గల ఆంధ్రులు నేటి ఆంధ్రప్రదేశ్ ను ఆదుకోవాలని, ప్రత్యామ్నాయ నూతన రాజకీయ నిర్మాణాన్ని ప్రోత్సహించాలని ఆయన కోరారు. నేటి పాలకులు  విష బీజాలతో ఆ నాటి ఉద్యమ పౌరుషాన్ని, ఆంధ్రుల త్యాగాలను నేటి తరానికి తాకకుండా విష వ్యూహాలలు రచిస్తున్నారని, ఉద్యమకారులును, ప్రశ్నించే వారిని పాలకులు వేధింపులుతోను, బెదిరింపులతోను ఉద్యమ చైతన్యాన్ని అణచి వేస్తున్నారని, ఆ నాడు జై ఆంధ్ర ఉద్యమ సారధులుగా తెన్నేటి విశ్వనాధం, గౌతు లచ్చన్న, కాకాని వెంకటరత్నం వంటి వారు ఆంధ్ర పౌరుషాన్ని ఎలుగెత్తి ఢిల్లీ పెద్దలకు ముచ్చెమటలు పట్టించారని, అలాంటి గొప్ప నేతలు నేడు కరువయ్యారని భారతదేశ చరిత్రలోనే జై ఆంధ్ర ఉద్యమం అత్యంత చారిత్రాత్మక మైనదని, ఆ నాటి స్వాతంత్ర్య పోరాట ఉద్యమం కన్నా ఎంతో గొప్ప ఉద్యమం జై ఆంధ్ర ఉద్యమం అని, నేడు ఆంధ్ర లో లేవనెత్తే ప్రతి ఉద్యమం వెనుక పెట్టుబడి దారులతోను, అధికార పక్షం తోను ఒప్పందాలు కుదుర్చుకుంటు ఉద్యమ లక్ష్యాలను అవినీతికి  వ్యాపారంగా మార్చుకుంటున్నారని, జై ఆంధ్ర ఉద్యమ త్యాగాలు, పోరాటాలు నేటి తరానికి తెలియనీయకుండా నేటి కలుషిత పాలకులు జాగ్రత్తలు తీసుకుంటు కల్పిత ఉద్యమ చరిత్రకు హీరోలు మిగులు తున్నారని, ఆ నాడు ఆంద్రుడుగా ఆంధ్ర పౌరుషాన్ని వీధి వీధినా ఎలుగెత్తి చాటారని, సుమారు 400 కు పై బడి ఉద్యమ కారులు 
జై ఆంధ్ర అంటు ప్రాణ త్యాగాలు చేసి ఆంధ్రుడి పౌరుషాన్ని, సత్తాను ఢిల్లీ కౌరవులకు తెలియచేశారని ఆయన గుర్తు చేసారు. ఆంధ్రప్రదేశ్ కు పట్టిన రాజకీయ మకిలిని కడిగేయాలని, లేకుంటే ఆంధ్రుల భవిష్యత్ అంతరించుకు పోయే ప్రమాదం వుందని, బ్రతకలేక ఆంధ్రులు బ్రతుకు తెరువవుకై వలసలు పోతున్నారని, పాలకుల వైఖరికి భయపడుతున్న ఆంధ్ర లోగల పెట్టుబడి దారులు ప్రక్క రాష్ట్రాలకు తరలి పోతున్నారని, బయట నుండి వచ్చే పెట్టుబడుదారులు సైతం ఆంధ్ర లో పెట్టుబడి పెట్టాలంటే భయబ్రాన్తులకు గురుతున్నారని, విద్యా వంతులు సైతం కూలి పనులకు సిద్ద పడుతున్నారని, ఆంధ్ర లో ఏ విధమైన అత్యవసర సర్వీసులు నేడు అందుబాటులో లేకపోవటం అన్యాయ మైన పాలనకు నిదర్శనం అని, నేటి పాలకులు సాధిస్తున్నది ఒక్కటే ఆంధ్ర లో అందరికి అందుబాటులో అమలు జరిగేది ఛీప్ లిక్కర్ తప్ప మరొకటి లేదని, రోజు రోజు కు ప్రజలు మోయలేని అప్పులకు దారి తీస్తున్నారని,ఆంధ్రుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా వుందని, మన పాలకుల బలహీనత ఢిల్లీ పెద్దలకు, మోది సర్కార్ కు  వరంగా మారిందని ఆయన పేర్కొన్నారు. గతించిన ఆంధ్రుడి పౌరుషాన్ని ఒక్కసారి జ్ఞప్తికి తెద్దాం మన ఆంధ్రప్రదేశ్ చరిత్రకు మనమే శాసన కర్తలుగా మారుదాం, కుల మత ప్రాంతాలతో విభజన రాజకీయాలకు ఆజ్యం పోస్తున్న సంకు చిత నేతలకు బుద్ది చెపుదాం ఆంధ్రప్రదేశ్ నూతన రాజకీయ చరిత్రకు పునాదులుగా నిలుద్దాం, కలుషిత పాలకులకు బుద్ది చెపుదాం ఆంధ్రప్రదేశ్ ప్రగతిని సాధించి చూపిద్దాం. జై ఆంధ్ర అనే ఒకే ఒక్క నినాదంతో హైదరాబాద్ నివాశ పాలకులను తరిమివేద్దాం పూర్తి స్థాయి ఆంధ్ర నివాశ పాలకులను స్వాగతిద్దాం అని ఆర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ కోరారు. ఈ సభకు ఆర్పిసి సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆర్పిసి సెక్యులర్స్ సర్వశ్రీ డివిఆర్ మూర్తి, దుడ్డె త్రినాద్, ఎండి హుస్సేన్, లంక దుర్గా ప్రసాద్, దుడ్డె సురేష్, వర్ధనపు శరత్ కుమార్, వల్లి శ్రీనివాసరావు, వాడపల్లి జ్యోతిష్, సిమ్మా దుర్గారావు, కొల్లి సిమ్మన్న, ఖండవల్లి భాస్కర్, లంక శ్రీరామ చంద్రమూర్తి, లంక మహాలక్ష్మి, మార్త ప్రభాకర్, పిల్లాడి ఆంజనేయులు,మట్టపర్తి తులసి, ముదపాక రామకృష్ణ, పిల్లా గణేష్ రెడ్డి తదితరులు పాల్గొని యున్నారు. 
మేడా శ్రీనివాస్, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్