ఇచ్చిన మాట నిలుపుకోవడం సీఎం జగన్ కే సాధ్యం: చందన నాగేశ్వర్





 TV77తెలుగు రాజమహేంద్రవరం రూరల్ :

ఇచ్చిన మాట నిలుపుకోవడం సీఎం జగన్ మోహన్ రెడ్డి కే సాధ్యమని, ఆయన  ఎన్నికలకు ముందు అవ్వ తాతలకు ఇచ్చిన  మాట ప్రకారం పింఛన్లు  సొమ్ము పెంచి ఇచ్చారని రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ పేర్కొన్నారు. పింఛను లభ్డిదారులకు ఆయన మంగళవారం శాటిలైట్ సిటీ, హుక్కంపేట మరియు కొలమూరు పంచాయతీ లలో జరిగిన వైస్సార్ పెన్షన్ కానుకు ను లభ్డిదారులకు అందిచారు.చందన నాగేశ్వర్  మాట్లాడుతూ గత పాలకులు హామీలు ఇచ్చి, తరువాత వాటిని వదిలేసేవారని, ఇచ్చిన మాటకు కట్టుబడి సమయానుకూలంగా హామీలను చేసే సత్తా ఒక్క సీఎం జగన్ మెహన్ రెడ్డి కే ఉందని తెలియజేసారు. ఇలాంటి విపత్కర పరిస్థితిలలో సైతం ఆపకుండా లబ్ధిదారుల చెంతకే పింఛన్లు అందేలా చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. పింఛన్లు  రూ.2500/- పెంచి అవ్వ, తాతల మోముల్లో ఆనందం పంచారని రూరల్ కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్  తెలియజేసారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పీ.వీ  సుబ్బరావు, పంచాయతీ కార్యదర్శిలు కృష్ణారెడ్డి, కాశీ విశ్వనాథ్, హనుమంతరావు, శాటిలైట్ సిటీ, హుక్కంపేట మరియు కోలమురూ గ్రామాల వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.