TV77 తెలుగు మహారాష్ట్ర :
మీరెప్పుడైనా ప్లాస్టిక్ బిడ్డ గురించి విని ఉంటారా?ప్లాస్టిక్ బిడ్డా?
నిజంగానే ఓ మహిళ ప్లాస్టిక్ బిడ్డకు జన్మనిచ్చింది. అందరినీ ఆశ్చర్యపరిచే ఈ వింత జనన ఘటన మహారాష్ట్రలోని ఔరంగబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.ఔరంగబాద్‌లోని సోహ్దాకు చెందిన ఓ మహిళ సదర్ ఆసుపత్రిలో వింత బిడ్డకు జన్మనిచ్చింది. ఆ నవజాత శిశువు శరీరం మొత్తం ప్లాస్టిక్‌తో చుట్టి ఉంది. వైద్య పరిభాషలో అటువంటి పిల్లలను కొల్లాయిడ్ బేబీస్ అంటారని డాక్టర్లు తెలిపారు. ఈ నవజాత శిశువు గురించి సదర్ ఆసుపత్రి వైద్యుడు మాట్లాడుతూ.11 లక్షల మంది శిశువుల్లో ఒకరు కొల్లాయిడ్ బేబీ జన్మిస్తుంటారు. గత ఏడేళ్లలో అటువంటి పిల్లలు ముగ్గురు జన్మించారు. అయితే ముగ్గురిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా మూడో వ్యక్తికి చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం మా ఆసుపత్రిలో జన్మించిన శిశువు ఆరోగ్యం ప్రస్తుతానికి బాగానే ఉంది. భవిష్యత్తులో ఈ చిన్నారి పూర్తిస్థాయి ఆరోగ్యంగా ఉంటుందని, ఎంతకాలం వరకు బతుకుతుందనేది స్పష్టంగా చెప్పలేం. అని అన్నారు.