పట్టి సీమలో మరో గొప్ప గుడి..!! స్వామీ కృష్ణానంద పురీ


 TV77తెలుగు  పట్టిసీమ :

    ప్రసిద్ధ శైవ క్షేత్రం పట్టిసీమ లో మరొక అద్భుత దేవాలయాన్ని నిర్మించేందుకు రంగం సిద్దం అయినట్లు పెనుగొండ శ్రీవాసవీ  ధాం పీఠాధి పతి స్వామీ కృష్ణానంద పురీ పేర్కొన్నారు. పోలవరం మండల పరిషత్ కార్యలయంలో శుక్రవారం ఎంపీపీ సుంకర వెంకట రెడ్డి ని కలిసిన స్వామీజీ  ఆలయ నిర్మాణం గురించి చర్చించారు.  రాష్ట్ర ఆర్య వైశ్య సంఘ నాయకుడు బొందాడ రామ్మోహనరావు (రాంపండు), పోల వరం ఆర్య వైశ్య నేత నాళం గాంధీ ఆలయ నిర్మాణ ప్రాధాన్యతను వివరించారు రాష్ట్రంలోనే అరుదైన శివ కేశవ మూర్తి  పంచ ముఖాంజ నేయ స్వామి విగ్రహాలను ఆలయంలో ప్రతిష్టించడం జరుగుతుందని స్వామీజీ తెలిపారు. సుమారు మూడు కోట్ల రూ వ్యయంతో నిర్మించే సుందరమైన  ఆలయ నిర్మాణానికి దాతలందరూ సహకరించాలని స్వామీ కృష్ణానంద పురీ విజ్ఞప్తి చేసారు. దక్షిణ కాశీగా పేరు గాంచిన పట్టిసీమ లో అద్భుతమైన శివ కేశవమూర్టి ఆలయంనిర్మించడం పట్ల ఎంపీపీ సుంకర వెంకట రెడ్డి   ఆనందం వ్యక్తం చేసి సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని ప్రకటించారు..ఈ కార్య క్రమంలో పోలవరం  మండల ఆర్య వైశ్య సంఘం సెక్రటరీ నార్కేడు మల్లి కృష్ణ మోహన్,టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ సభ్యులు  పరస రాధా కృష్ణ, సింహాద్రి ప్రసాద్, వేండ్ర ప్రసాద్,సుంకర రామ్ కుమార్ ,రెడ్డి అప్పన్న అనంతం చిన్న వీరాస్వామి ఈ కార్య క్రమంలో పాల్గొన్నారు.