ఆహ్లాదకర ప్రమాదం


 

TV77తెలుగు  విశాఖపట్నం :

విశాఖపట్నం విశాఖపట్నం తీరంలో ఉన్న బీచ్లలో రోజూ ఏదోఒక చోట పర్యాటకులు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు . సముద్రం వెనక్కు వెళ్లినపుడు కనిపించే రాళ్లపైకి చేరి పర్యాటకులు ఫొటోలు దిగేందుకు ఉత్సాహం చూపుతుంటారు . అవి నాచుపట్టి ఉండటంతో జారి సముద్రంలో పడి అలల తాకిడికి కొట్టుకు పోతుంటారు . దూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు ఇక్కడి సముద్రంపై అవగాహన లేక జాగ్రత్తగా వ్యవహరించక పోవడమూ ప్రమాదాలకు కారణమవుతోంది. శనివారం నాడు ఆర్కేబీచ్ బస్టాప్ సమీప తీరంలోని రాళ్లపై జనాలు ( ఆదివారం ప్రమాదం జరిగింది ఇక్కడే )  సందర్శకుల్ని, తీరాల్లో పర్యటించేవారిని రక్షించడంలో కీలకపాత్ర పోషించే లైఫ్గార్డులకు గత తొమ్మిది నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం గమనార్హం .సందర్శకుల్ని రక్షించడంలో కీలకపాత్ర పోషించే చిన్నపాటి మరబోటు ఒక్కటి కూడా లేదు . 

ఏడాది  - మృతులు 

2018    - 55

2019    - 51 

2020   - 64 

2021    - 63

కీలకపాత్ర పోషించే చిన్నపాటి మరబోటు ఒక్కటి కూడా లేదు .  లైట్ హౌస్ సమీప తీరంలో రాళ్లపై ప్రమాదకరంగా పర్యాటకులు ఇలా . ( ఆదివారం నాటి చిత్రం )