కొత్త అప్పుల కోసమే జిల్లాల విభజన.


TV77తెలుగు రాజమహేంద్రవరం :

3 రాజధానులను ఉపసంహరించుకున్నాకనే జిల్లాల విభజన సరియైనది. 

భద్రాద్రి, దుమ్ముగూడెం  లను ఏపిలో అంతర్భాగంగా కేంద్ర ప్రభుత్వం తో ప్రకటన చేయించాలి. 

ఆంధ్రప్రదేశ్ లో ఉధ్యమాలేనా  ! అభివృద్ధి ఉండదా. 

సోము ప్రకటన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కు పెను ప్రమాదం.

మేడా శ్రీనివాస్, ఆలోచన, 

కొడాలి స్వరంలో  మార్పు దేనికి  సంకేతంగా భావించాలి ! భయానికా, మార్పుకా  ! అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్పిసి)ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి వారాంతపు సమావేశంలో ఆర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ సందేహం వ్యక్త పరిచారు.వున్న 13 జిల్లాల పరిస్థితి అందాకారంగా వుందని, ఏ జిల్లాలోను ఒక్క అభివృద్ధి కూడా నేటికి లేదని, రోడ్లు పెద్ద పెద్ద గుంతలతో అస్తవ్యస్తంగాను, ప్రమాదాలకు చేరువుగా వున్నాయని, రోడ్లు  గుంతలతో వాహనదారులు నష్టపోతు భయబ్రాంతులకు గురైతునే  రోడ్డు టాక్సులు, టోల్ ప్లాజా రుసుములు చెల్లిస్తున్నారని, ఇంత దుర్భర పరిస్థితుల్లో ఆంధ్రులు బ్రతుకుతున్నా పాలకులకు పట్టనట్టు వున్నారని, ప్రస్తుతం ఏపిలో వున్న జిల్లాలు ఎడారిగా వుండగా కొత్త జిల్లాలు అంటు తెర మీదకు తేవటం దారుణమని, ఒక ప్రక్క ఏపి ఉద్యమాల సెగలో రగులు తుండగా అశాస్త్రీయ మైన విధానాలతోను, ఆలోచనలతోను 2 గంటల వ్యవధిలో 26 జిల్లాలకు ఏపి మంత్రి వర్గం ఆమోద ముద్ర వేయటంలో ప్రజా ద్రోహం కాదా అని, ఏపిలో అనేక ప్రజా సమస్యలు ఏపి సర్కార్ కు కనపడక పోవటం, ప్రజల గొంతు విన్పించుకోక పోవటం ప్రజా ద్రోహంగా భావించాలని, పాలకుల ఆటవిక పాలనకు భయపడి సామాన్యులు ప్రశ్నించ లేకపోతున్నారని, గొంతెత్తలేకపోతున్నారని, ఈ తరహా భయం తిరుగుబాటుగా మారుతుందని, ఆ తిరుగుబాటుతో నేటి పాలకులు కాలగర్భంలో కలిసి పోవటం ఖాయమని ఆయన హెచ్చిరించారు. 26 కొత్త జిల్లాల ప్రకటన వెనుక పెద్ద ఋణ కుట్ర దాగి వుందని, ఆర్ధిక సంక్షోభంలో కొట్టు మిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి కొత్త జిల్లాలో వున్న జనాభాను, ఆదాయ పరిస్థితులును, సహజ వనరులను, సంపదను ఒక పోజెక్ట్ రూపంలో మార్చి జిల్లాకో 7 వేల కోట్లు చప్పున మొత్తంగా సుమారుగా 1.82 కోట్లు కొత్త అప్పులు పుట్టించే విధంగా కుట్ర చేస్తున్నారని,  ఇప్పుడు మనతో పాటుగా మరో 10 ఏళ్లలో పుట్టే బిడ్డను కూడా తాకట్టు పెట్టేసే పెద్ద కుట్ర జరుగుతుందని, కొత్త జిల్లాల ముసుగులో జిల్లా కేంద్రాలను  తారుమారు చేసే కుట్ర కూడా దాగి వుందని, రాష్ట్ర విభజన సమయంలో కూడా నూజువీడు అని, ప్రకాశం జిల్లా అని ప్రజల దృష్టి మళ్లించి అమరావతి కేంద్రంగా రాజధానిని ప్రకటించారని, ఇప్పుడు కూడా అదే విధంగా జిల్లా కేంద్రాలను పెట్టుబడి దారులకు అనువుగా సర్కార్ మదిలో వున్నట్టే పెద్ద భూ మాయ జరుగుతుందని, ప్రభుత్వం 3 రాజధానుల ప్రక్రియను పక్కాగా ఉపసంహరించుకున్నాకనే  కొత్త రాజధానులు ప్రకటించాలని ఆయన తెలిపారు. ఏపిలో కొంతమంది ఇతర పెట్టుబడి వర్గాల కనుసైగలో ఏపి పాలన జరుగుతుందా అనే అనుమానాలు బలపడుతున్నాయని,ఏపిలో అస్తిత్వాన్ని సృష్టిస్తు పాలకుల ఆశీస్సులతో వనరులను సంపదను దోచుకుంటున్నారని, అదృశ్య శక్తుల ప్రమేయం తోనే ఉద్యమాలు పుడుతున్నాయి, కొనసాగుతున్నాయని, పాలకులు ప్రజల న్యాయమైన కోరికలను సైతం ప్రజలకు అందివ్వటంలో వ్యూహాత్మకంగా విఫలమైతున్నారని, ఏపిలో ఉద్యమాలు కొనసాగటం వెనుక సర్కార్ కుట్ర వెనుక  ప్రజలు గ్రహించలేని ఎదో ఒక రాజకీయ, ఆర్ధిక ప్రయోజనం వుందని, చట్టబద్ధ మైన హామీలను అమలు చేయమని ఉద్యమాలు జరుగుతుంది బహుశా ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనే నని ఆయన తీవ్ర ఆవేదన చెందారు. రాష్ట్ర విభజన సమయంలో ఆ నాటి ఏపి నేతల అత్యుత్సాహం, దుందుడుకు వైఖరి కారణంగా భద్రాద్రి, దుమ్ముగూడెం ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోల్పోవలసి వచ్చిందని, నేటికి ఆ ప్రాంతాలతో గోదావరి ప్రాంత ప్రజల సంబంధాలు పెనవేసుకుని వున్నాయని, భద్రాద్రి రాముల వారి మొత్తం ఆస్తులు, దుమ్ముగూడెం ప్రధాన జల వాయువు గోదావరి ప్రాంతాన్ని  ఎన్నటికి విడదీయలేని సంబంధాలు వున్నాయని, ఏపి నుండి భద్రాచలం ను, దుమ్మగూడెం ను ఏపిలో గల తూర్పుగోదావరి జిల్లాలో కలపాలని కేద్ర ప్రభుత్వాన్ని అడిగే దమ్మున్న నేతలు ఏపిలో ప్రస్తుతం లేరని, ఏపిలో వున్న ప్రస్తుత నేతలు హైదరాబాద్ లో గల వ్యాపారాలు, ఆస్తులను కాపాడుకోవటానికి ఏపి కి జరిగిన నష్టాన్ని ప్రశ్నించ లేకపోతున్నారని, ఈ సున్నిత అంశాన్ని తెలంగాణా ప్రజలకు నచ్చచెప్పే విధంగా భాద్యత తీసుకొనే వారు కూడా లేకపోవడం ఏపి ప్రజల దురదృష్టం అని ఆయన మనస్తాపం చెందారు.  బిజెపి ఏపి అధ్యక్షులు సోము వీర్రాజు ఈ మధ్య తొందర పాటు మాటలతో రాష్ట్ర ఐఖ్యత ను మంటగలుపుతున్నారని, గతంలో రాజధాని అమరావతి ఉద్యమ రైతులు కోసం తప్పుగా మాట్లాడి నేరుగా ఆ పార్టి జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఆగ్రహానికి గురైయ్యారని, మళ్ళీ నేడు కడప జిల్లాను హత్యలు చేసే జిల్లాగా సంబోదించారని, సోము పై వచ్చిన ఆ ప్రాంత తిరుగుబాటు కు బెదిరిన సోము బహిరంగ క్షమాపణ చెప్పారని, మొత్తం మీద సోము కారణంగా ఆంధ్రప్రదేశ్ లో వివాదాలు లేవనెత్తటమే కాకుండా బిజెపి పార్టి కి పెద్ద తలనొప్పి సమస్యలు వస్తున్నాయని, ఈ మధ్య సోము మాటల కారణంగా శాంతి భద్రతల సమస్యలకు ఆజ్యం పోస్తున్నారని, సోము మాటల ఆంతర్యం వెనుక ఆ పార్టీ జాతీయ స్థాయి నేతల కుట్ర వుందా  ! అనే అనుమానాలు ఆంధ్రులను వెంటాడుతున్న ప్రశ్నలని ఆయన తెలిపారు. ఈ మధ్య ఏపి మంత్రి కొడాలి నాని మాటల్లో మార్పు రావటానికి కారణం ఏమిటని  ! కొడాలి ఎవవరిని సంబోధించిన వాడు వీడు, లేదా  మరో బూతు పదం కచ్చితంగా వుంటుందని, ఈ మధ్య కొడాలి మాటల్లో వారు వీరు అనే పదాలు కొత్తగా వినపడుతున్నాయని, అందుకు కారణం స్వతహాగా కొడాలి స్వరంలో మార్పు వచ్చిందా లేక రాబోవు రోజుల్లో ప్రభుత్వాలు మారితే తన పరిస్థితి ఏమిటి అని దూరదృష్టితో తగ్గి భయపడ్డారా అనే ప్రజల సందేహనికి కొడాలి సదుద్దేశంతో వివరణ ఇవ్వాలని ఆర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ కోరారు. సభకు ఆర్పిసి నగర సెక్యులర్ డివిఆర్ మూర్తి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆర్పిసి సెక్యులర్స్ సర్వశ్రీ ఎవిఎల్ నరసింహారావు  , పెండ్యాల కామరాజు , లంక దుర్గా ప్రసాద్దు, దుడ్డె సురేష్,  వర్ధనపు శరత్ కుమార్, వల్లి శ్రీనివాసరావు, దోషి నిషాంత్ ,  పిల్లాడి ఆంజనేయులు, వల్లి వెంకటేష్,  కోటు సుశీల, కోటు పోతురాజు, రెడ్డి స్వర్ణలత, కొల్లి సత్యనారాయణ, వాడపల్లి జ్యోతిష్, బత్తుల సూర్యనారాయణ, ముప్పన రమేష్, పెచ్చెట్టి శివాజి, నడిపూడి శ్రీనివాసరావు, కొలిమిల్లి లక్ష్మణరావు, కొలిమిల్లి అనంతలక్ష్మి , కొత్తపల్లి సుధాకర్,  తదితరులు పాల్గొనియున్నారు. 

మేడా శ్రీనివాస్, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్