రామారావు విగ్రహాన్ని ధ్వంసం : నిందితుడు అరెస్ట్


 TV77తెలుగు గుంటూరు రూరల్ :

గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం పరిధిలోని దుర్గిలో కలకలం రేపింది. దుర్గి గ్రామానికి చెందిన శెట్టిపల్లి కోటేశ్వరరావు గ్రామ ప్రధాన రహదారిపై ఉన్న ఎన్‌టిఆర్‌ విగ్రహాన్ని సుత్తితో పగలగొట్టేందుకు ప్రయత్నించాడు. స్థానికులు గమనించే సరికే విగ్రహం పాక్షికంగా దెబ్బతింది. ఘటనా స్థలానికి దుర్గి ఎస్‌ఐ పాల్‌ రవీందర్‌ చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు కోటేశ్వరరావు మాజీ మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ యలమంద కుమారుడిగా పోలీసులు గుర్తించారు. దాడి ఘటనపై స్పందించిన జిల్లా ఎస్పీ నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించారు. ఎన్‌టిఆర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు యత్నించిన దఅశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ స్పందిస్తూ.ఎన్‌టిఆర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించిన కోటేశ్వరరావుపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.