అత్యంత ఖరీదైన మరకత (పచ్చతో చెక్కిన) శివలింగం


 TV77తెలుగు  తమిళనాడు:

 తంజావూరులో అత్యంత ఖరీదైన మరకత పచ్చతో చెక్కిన శివలింగాన్ని సీఐడీ ఐడల్‌ వింగ్‌ పోలీసులు జప్తు చేశారు.  ఓ నగల వ్యాపారి బ్యాంకు లాకర్‌ నుంచి దీన్ని స్వాధీనం చేసుకున్నారు. 2016లో ఇది నాగపట్టణం జిల్లాలోని తిరుకువలై త్యాగరాజస్వామి ఆలయంలో చోరీకి గురైనదేనా ? అనే కోణంలో సీఐడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.8 సెం.మీ. ఎత్తు కలిగిన ఈ శివలింగం ఖరీదు రూ.500 కోట్లకు పైబడి ఉంటుందని అంచనా వేశారు. తంజావూరులోని ఓ ఇంట్లో పురాతన విగ్రహాలు ఉన్నట్లు నిర్దిష్ట సమాచారం. అందుకున్న పోలీసులు తనిఖీలకు రంగంలోకి దిగారు. తంజావూరులోని ఆరుల నందనగర్‌ సెవెన్త్‌ క్రాస్‌ లంగ్వల్‌ హోమ్స్‌లో సోదాలు జరిపారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. చివరకు తమ వద్ద మరకత శివలింగం ఉన్నట్లు వారు అంగీకరించారు. తన తండ్రి తంజావూరులోని బ్యాంకు లాకర్‌లో ఓ పురాతన శివలింగాన్ని ఉంచాడని వ్యాపారవేత్త సామియప్పన్‌ కుమారుడు అరుణ్‌ వెల్లడించాడు. దీంతో బ్యాంకు లాకర్‌ను తెలిచిన అధికారులు శివలింగాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇది దాదాపు 1000 ఏళ్ల నాటిదని, రాజేంద్ర చోళరాజు పాలనలో తూర్పు ఆసియా దేశం నుంచి తీసుకువచ్చాడని చరిత్ర చెబుతోంది..