TV77తెలుగు పీలేరు :
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య మదనపల్లిలో బిసి సమావేశానికి వెళుతన్న సందర్భములో మార్గమధ్యలో పీలేరు పట్టణం నాలుగు రోడ్ల కూడలిలో ఆయనకు బిసి సంఘ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఆయన పుష్పగుచ్ఛం యిచ్చి, దుశ్శాలువ కప్పి సన్మానించారు. అనంతరం స్థానిక నాలుగు రోడ్ల కూడలి నుండి స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎదురుగా ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ బహుజనుల రాజ్యాధికారం కోసం బీసీలంతా ఏకమై ఐక్యం కావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. పై కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం పీలేరు నియోజకవర్గం అధ్యక్షులు చంద్రగిరి బాలరాజు, ప్రధాన కార్యదర్శి టి రవి, గౌరవ అధ్యక్షులు రామకృష్ణ, ఉప కార్యదర్శి ఆవుల రమణ, ఉపాధ్యక్షులు బీవీ రమణ, మండల అధ్యక్షులు రెడ్డప్ప, మల్లెల మహేష్ అధిక సంఖ్యలో బీసీలు పాల్గొన్నారు.