జాబ్ మేళ పై అవగాహన సదస్సు కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి ఓ.ఎస్.డి దుర్గాప్రసాద్


 TV77 తెలుగు   పీలేరు :

మంగళవారం స్థానిక వెలుగు కార్యాలయం సమీపంలోని సి.ఎల్.ఆర్.సీ భవనం నందు మెగా జాబ్ మేళా పై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓ.ఎస్.డి దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత ప్రభుత్వ ఉద్యోగాలు వైపే చూడకుండా ప్రైవేటు ఉద్యోగాలు పొందుటకు కూడా ప్రయత్నించాలని ప్రైవేటు పరిధిలోనే మంచి జీతాలతో మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు.ఈ సమావేశానికి హాజరైన ప్రతి అభ్యర్థి పదిమంది చొప్పున అభ్యర్థులను జాబ్ మేళాకు హాజరయ్యే ట్లు చేయాలని అన్నారు. పీలేరు సర్పంచ్ డాక్టర్ షేక్ హాబీబ్ బాష మాట్లాడుతూ యువత అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించడమే పెద్దిరెడ్డి కుటుంబం, శాసనసభ్యులు చింతల రామచంద్రారెడ్డి ఆకాంక్ష అని వారి సూచనల మేరకే ఈ జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. సుమారు 34 కంపెనీలు వస్తున్న ఈ జాబ్ మేళా ఈనెల 20వ తేదీ పీలేరు సంజయ్ గాంధీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగునని, పెద్ద సంఖ్యలో అభ్యర్థులు హాజరై మంచి వేతనంతో ఉద్యోగాలు పొంది, తల్లిదండ్రులపై ఆధారపడకుండా జీవితంలో స్థిరపడాలని హితబోధ చేశారు. ఇంకా పై కార్యక్రమంలో వెలుగు ఏరియా కోఆర్డినేటర్ రుతు మాట్లాడుతూ 18-35 సంవత్సరాల మధ్య గల యువతీ యువకులు జాబ్ మేళ లో పాల్గొని వారి భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలని అభ్యర్థులకు కొన్ని సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎం.పీ.డీ వో జయరాజ్, మండల పరిషత్ ఉపాధ్యక్షులు పీ.వీ చలపతి, వార్డు సభ్యులు విక్టరీ వెంకటరమణారెడ్డి, ఆబిద్, ఏ.ఎస్ హాబీబ్, పంచాయతీ ఈ.ఓ వరప్రసాద్, వెలుగు ఏ.పీ.ఎం లక్ష్మి రెడ్డి, వై.సి.పి నాయకులు షాజహాన్, పెద్ద సంఖ్యలో యువతీ యువకులు పాల్గొన్నారు.