TV77తెలుగు రాజమహేంద్రవరం:
కల్లుగీత సహకార సంఘం నాయకుల వినతి
రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పోరేషన్ గ్రూప్-1 కల్లుగీత సహకార సంఘానికి చెందిన 5 షాపులకు కల్లు అమ్ముకోవడానికి స్థలంగా ఆవలో వున్న ప్రభుత్వ భూమిని కేటాయించాలని సంఘం అధ్యక్షుడు గుత్తుల దుర్గారావు, ఉపాధ్యక్షుడు మట్టా శేషు, కార్యదర్శి మట్టా శ్రీను కోరారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ. రాజమహేంద్రవరం కల్లుగీత సహకార సంఘం 1972 లో 150 మంది సభ్యులతో ఏర్పాటు చేసి చుట్టుప్రక్కల గ్రామాలనుండి కల్లు తీసుకొనివచ్చి అమ్ముకోవడం జరిగేదని,అప్పటి నుండి కల్లు షాపులకు స్థలము లేక అమ్మకం దారులు అనేక ఇబ్బందులకు గురగవుతూ, వ్యాపారాన్ని కొనసాగించేవారని పేర్కొన్నారు.కాలక్రమేణా ఈ వృత్తిపై జీవనం సాగక సదరు వృత్తిని మానేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం 100 కుటుంబాలు ఈ వృత్తిపై జీవనం సాగిస్తున్నాయని,కాని కల్లు అమ్ముకోవడానికి, అద్దెకు ఇల్లుగాని, స్థలముగాని, ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఒకేవేళ ఎవరైనా ఇచ్చినా, తరువాత తీసియ్యమని అంటున్నారని వాపోయారు. రోడ్డు మీద అమ్ముకుంటే నగరపాలక సంస్థ సిబ్బంది తీసేయాలంటున్నారని, బరకాలతో పందిరిలాగ వేసుకొని అమ్ముకొంటుంటే, అకతాయిలు రాత్రి పూట తగలబెట్టి బాధలకు గురిచేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు.రాజమండ్రిలో కల్లు వ్యాపారం, వృత్తి నిర్వీర్యం అయిపోతున్నాయని ఆందోళన చెందారు. గతంలో అనేకసార్లు స్థలం గురించి అర్జీ పెట్టుకున్నా ఫలితం లేకపోయిందని,తమ సంఘానికి అన్యాయం జరుగుతూనే వుందన్నారు. అన్ని వృత్తులవారికి స్థలాలు గతంలో కేటాయించారు. కాని తమకు మాత్రం ఇంతవరకు కేటాయించలేదని వారు తెలిపారు.దయచేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తమ సంఘానికి తగు స్థలం కేటాయించే విధంగా చూసి సంఘాన్ని ఆర్థిక బాధలనుండి కాపాడాలని దుర్గారావు,శేషు, శ్రీను కోరారు.విలేకర్ల సమావేశంలో డైరెక్టర్లు బొక్కా శ్రీనివాసరావు,కట్టా శ్రీనివాస్ పాల్గొన్నారు.