TV77 తెలుగు రాజమహేంద్రవరం :
శనివారం నాడు మధ్యాహ్నం నుంచి రాజమహేంద్రి గోదావరి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పుష్కరాల రేవు లో సాధువులకు, యాచకులకు, భోజనాలు పెట్టి వారిచేత నూతన సంవత్సర సందర్భంగా సాధువుల చేత, యాచకుల చేత కేకు కట్ చేయించి తర్వాత పుష్కరాల రేవు ను శుభ్రపరిచి నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సి. ఆర్. పి. ఎఫ్. 42 వ బెటాలియన్ కమాండెంట్ సతీష్ కుమార్, మరియు నీతు పాల్గొన్నారు. 42 వ బెటాలియన్ కమాండెంట్ సతీష్ కుమార్ మాట్లాడుతూ రాజమహేంద్రి గోదావరి పరిరక్షణ సమితి చైర్మన్ టీ.కే. విశ్వేశ్వర్ రెడ్డి, చేస్తున్న ఈ గోదావరి ఘాట్ లను శుభ్రపరిచే బృహత్ కార్యక్రమం చాలా ఉన్నతమైనది. గోదావరి పరిరక్షణ సమితి సభ్యులు చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రి మహిళా డిగ్రీ మరియు పీ.జీ కళాశాల ప్రిన్సిపాల్ సౌందర్య, ఎన్. ఎస్. ఎస్. పి. ఓ లు లక్ష్మీ ప్రవీణ, ప్రసాద్, గోదావరి పరిరక్షణ సమితి సభ్యులు నాగేంద్రబాబు, వీరస్వామి, వెంకట్, కరుణాకర్, ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు, కళాశాల అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.