ఒమిక్రాన్‌ సోకకుండా ఆపడం సాధ్యం కాదు : ప్రభుత్వ సీనియర్ వైద్య నిపుణులు


 TV77తెలుగు  న్యూఢిల్లీ : 

ఒమిక్రాన్‌ను ఆపడం ఎవరి తరం కాదని, దీని బారిన ప్రతి ఒక్కరూ పడాల్సిందేనని ఇండియా కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎపిడెమాలజీ సైంటిఫిక్‌ అడ్వైజర్‌ కమిటీ చైర్‌పర్సన్‌, అంటు వ్యాధుల నిపుణులు డా.జయప్రకాష్‌ ముల్లియుల్‌ తెలిపారు. బూస్టర్‌ డోసు వైరస్‌ వ్యాప్తి ఉధృతిని నిలువరించలేదని అన్నారు. బూస్టర్‌ డోసు గురించి మాట్లాడుతూ ' ఏమీ తేడా లేదు. ఇన్‌ఫెక్షన్‌ సోకుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇదే జరుగుతుంది' అని తెలిపారు. కోవిడ్‌ ఇకపై ఏమాత్రం భయపెట్టలేదని, నూతన వేరియంట్‌ చిన్న పాటి లక్షణాలుంటాయని, ఆసుపత్రి పాలయ్యే అవకాశాలు తక్కువని అన్నారు. ఈ వైరస్‌ను మనం సమర్థవంతంగా ఎదుర్కొగలమని ధైర్యాన్నిచ్చారు. డెల్టాతో పోల్చుకుంటే ఈ వైరస్‌ అంత ప్రమాదకరమేమీ కాదని, అయితే ఇది సోకకుండా ఆపడం ఎవరి వల్ల కాదని తెలిపారు. ఇన్‌ఫెక్షన్‌ ద్వారా ఏర్పడ్డ సహజ ఇమ్యునిటీ జీవితాంతం ఉంటుందని, దీని వల్లే ఇతర దేశాల్లా .. భారత్‌ తీవ్రంగా ప్రభావితం కావడం లేదని అన్నారు.వ్యాక్సిన్ల రాకముందే దేశంలోని 85 శాతం మంది ప్రజలను మహమ్మారి సోకిందని అన్నారు. తొలి డోసే. బూస్టర్‌ డోసని డా. జయప్రకాష్‌ చెప్పారు. ఏ వైద్య సంస్థలు బూస్టర్‌ డోసులను ఇవ్వాలని సూచించలేదని ఎత్తి చూపుతూ.. మహమ్మారి వ్యాప్తిని ఎవరు ఆపలేరని తెలిపారు. వైరస్‌ వ్యాప్తి గురించి చెబుతూ. ఈ వేరియంట్‌ రెండు రోజుల్లోనే ఇన్‌ఫెక్షన్‌ని రెట్టింపు చేస్తుందని, పరీక్ష ఒమిక్రాన్‌ను గుర్తించక ముందే. సోకిన వ్యక్తిన కారణంగా పెద్ద సంఖ్యలో ఇతరులకు వైరస్‌ వ్యాప్తి చెందుతుందని అన్నారు. బూస్టర్‌ డోసు గురించి సూచించలేదని, అయితే ముందస్తు జాగ్రత్తగా ప్రికాషన్‌ డోసు సూచించామని, ఎందుకంటే 60 ఏళ్లకు పైబడిన వారికి రెండు డోసులు పనిచేయడం లేదని తెలిపారు. మనలో చాలా మందికి కరోనా వేరియంట్‌ సోకినట్లు తెలియదని, 80 శాతానికి పైగా ప్రజలకు. ఆ విషయం తెలియకపోవచ్చునని పేర్కొన్నారు.