TV77తెలుగు కొండపల్లి :
ఇంట్లో ఊరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఆటో డ్రైవర్ వల్లభనేని వర్మ...!!!
కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని చెబుతున్న స్థానికులు....!!!
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు...!!
కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో బిజెపి తరుపున కౌన్సిలర్ గా పోటీ చేసిన ట్రాన్స్ జెండర్ సమంత అలియాస్ నందితా వర్మ తండ్రి వల్లభనేని వర్మ ఈరోజు తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇబ్రహీంపట్నం లోని తన నివాసం లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని చనిపోయినట్లు సమాచారం అందుతుంది.ఆటో డ్రైవర్ గా పని చేస్తున్న వల్లభనేని వర్మ కుటుంబ కలహాల నేపథ్యంలో బలవన్మరనానికి పాల్పడి ఉంటాడని స్థానికులు చెబుతున్నారు. అయితే వర్మ మృతి పట్ల కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
సత్య...రిపోర్టర్, మైలవరం