TV77తెలుగు రాజమహేంద్రవరం :
రాజమండ్రి ప్రెస్ క్లబ్ అంశంలో ఈ నెల 11 వ తేదీన రెండు వార్తలను tv77 వెబ్ సైట్ లో పబ్లిష్ చేశాము.
ఇందులో మొదటిది.
ప్రెస్ క్లబ్ భాగోతం..1 పేరుతో..నాలుగేళ్ళుగా ఎన్నికలు లేవు..లెక్కా పత్రాలు లేవు...రూ.40 లక్షల ఆదాయం స్వాహా..
రెండవది. కోర్టు కేసులకు..ఎన్నికలకు లింక్ ఏమిటి..?
ఈ వార్తలకు సంబంధించి మనఃపూర్వకముగా మా tv77 వెబ్ సైట్ వేదికపై వివరణ, సంజాయిషీ ఇస్తున్నాము.రాజమండ్రి ప్రెస్ క్లబ్ ప్రస్తుత అధ్యక్షుడు కుడుపూడి పార్థసారథి గారు, పాలకవర్గంపై పలు ఆరోపణలను పబ్లిష్ చేశాము. ఇందులో మా వెబ్ సైట్ కు ఎటువంటి కక్షకాని, స్వార్ధపూరితమైన ఆలోచన గాని లేదు..కొంతమంది సాయంకాలం పత్రికలకు సంబంధిన వ్యక్తులు తమ వద్ద రాజమండ్రి ప్రెస్ క్లబ్ ప్రస్తుత పాలకవర్గం, అధ్యక్షుడు కుడుపూడి పార్ధసారధి అంశంలో జరిగిన అవతవకలు, 40 లక్షలు గోల్ మాల్ జరిగిందని, తమ వద్ద పూర్తిస్ధాయి ఆధారాలు ఉన్నాయని నమ్మబలికి మా tv77 వెబ్ సైట్ వేదికగా రాజమండ్రి ప్రెస్ క్లబ్ పై ఆధార రహిత వార్తను పబ్లిష్ చేయించటానికి కారణమయ్యారు.మా వెబ్ సైట్ చేసిన విచారణలో ఈ వార్త పూర్తిగా అవస్తమని తేలటంతో రాజమండ్రి ప్రెస్ క్లబ్ పాలకవర్గానికి, అధ్యక్షులు కుడుపూడి పార్థసారథి గారికి బహిరంగ క్షమాపణలు tv77 వెబ్ సైట్ తరుపున తెలియజేసుకొనుచు, ఇటువంటి తప్పు మరొకసారి జరగదని మనః పూర్వకముగా తెలియజేసుకొనుచూ మా తప్పును క్షమించగలరని బహిరంగంగా కోరుతున్నాము..tv77 వెబ్ సైట్