తుదిశ్వాస విడిచిన మాజీ ఎమ్మెల్యే


 TV77 తెలుగు ఆలమూరు :

 రాజకీయ దిగ్గజం, దాన కర్ణడు, ఆలమూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వీవీఎస్ఎస్ చౌదరి మంగళవారం సాయంత్రం హైదరాబాద్ కాంటినెంటల్ ఆసుపత్రిలో గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతూ కొద్ది క్షణాలు క్రితం తుదిశ్వాస విడిచారు. చౌదరి సతీమణి సత్యవతి, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, కుమార్ బాబులు ఆయన భౌతిక కాయాన్ని మండపేట ఆయన స్వగృహానికి తీసుకొస్తున్నారు. బుధవారం ఉదయం అభిమానుల సందర్శనార్థం కొద్దీ సేపు భౌతిక కాయాన్ని ఆయన స్వగృహంలో నందు ఉంచి అనంతరం అంతిమ వీడ్కోలు నిర్వహించనునారు. చౌదరి మృతికి  శాసన మండలి మాజీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, రెడ్డి అనంత కుమారి దంపతులు, ఏపీ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు, మాజీ ఏఎంసీ చైర్మన్ ఈదర సత్యనారాయణచౌదరి (నల్లబాబు), మాజీ సహకారసంఘం ఛైర్మన్ ఒంటిపల్లి సతీష్, మాజీ ఏఎంసీ ఉపాధ్యక్షుడు  గొడవర్తి దుర్గాప్రసాద్ (బాబీ), తాడి శ్రీనివాసరెడ్డి, దండంగి మమత,  చుండ్రు శ్రీనివాసు, రాయుడు సుభాకర్, మెర్ల గోపాలస్వామి, చౌదరి గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.