అమరావతి రైతులకు పవన్ భరోసా


 ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఆప్రాంత రైతులు పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అమరావతి ప్రాంత రైతుల పాదయాత్ర ముగింపు సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. మంగళగిరిలో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించుకునేందుకు కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా దీక్షకు దిగిన పవన్‌ను అమరావతి ప్రాంత మహిళా రైతులు కలిశారు. తొలి నుంచి అమరావతి ఉద్యమానికి మద్దతుగా ఉన్న పవన్‌కు కృతజ్ఞతలు చెప్పిన వారు.. ముగింపు సభకు రావాలని ఆహ్వానించారు. తమ ఆహ్వానం పట్ల పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించినట్లు అమరావతి ప్రాంత మహిళా రైతులు తెలిపారు.  రాష్ట్రానికి ఒకే రాజధాని అని భరోసా ఇచ్చాన పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలిపిన మహిళా రైతులు.