జన నీరాజనాల నడుమ జగన్మోహనుడు జన్మదినం


 TV77 తెలుగు మైలవరం:

మైలవరం ఎమ్మెల్యే వసంత పిలుపు మేరకు కదిలిన మైలవరం వైసీపీ శ్రేణులు.... 

ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా విస్తృతంగా సేవ కార్యక్రమాల నిర్వహణ....!!!

మైలవరం వ్యాప్తంగా రక్తదాన శిబిరాల ఏర్పాటుకు నేతల కసరత్తు....!!!

రాష్ట్ర ప్రజల సంక్షేమ పథకాల సృష్టికర్త ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ప్రజా సేవకు అంకితం కానున్నాయి. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఇచ్చిన పిలుపు మేరకు నియోజకవర్గం వ్యాప్తంగా సేవా కార్యక్రమాల నిర్వహణకు వైసీపీ శ్రేణులు సిద్ధం అయ్యారు. జననేత జగన్మోహనుడికి జననీరాజనాల నడుమ పుట్టిన రోజు వేడుకలు జరగనున్నాయి.మైలవరం నియోజకవర్గం వ్యాప్తంగా పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి మరో మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. గత  ఏడాది ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు పురస్కరించుకొని జరిగిన రక్తదాన కార్యక్రమం గిన్నిస్ రికార్డు సృష్టించగా.. అదే రికార్డ్ మళ్ళీ బద్దలు కొట్టేందుకు వైసీపీ కుటుంబం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది.

సత్య..రిపోర్టర్, మైలవరం