లారీని ఆర్టీసీ ఢీ


TV77 తెలుగు  మహబూబాబాద్:

 తొర్రూర్ మండలం గుర్తుర్ గ్రామ శివారులోని ఊకల్ క్రాస్ రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు వెనుకనుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కండక్టర్‌కు తీవ్ర గాయాలవగా పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యారు. ఆర్టీసీ బస్సు నర్సంపేట నుండి తొర్రూర్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ గండ్రాతి సతీష్ తన పోలీసు వాహనంలో కండక్టర్‌ను, ప్రయాణికులను ఆస్పత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.