TV77 తెలుగు రాజమహేంద్రవరం :
కఠోర సాధన ద్వారా ఏ రంగంలోనైనా రాణించగలం
యువ క్రీడా కారులకు భారత క్రికెటర్ శ్రీ కర్ భరత్ సూచన
గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయడమే ప్రధాన ఉద్దేశ్యం.
జక్కంపూడి ప్రీమియర్ లీగ్ టోర్నీ జెర్సీ లోగోల ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న భారత క్రికెటర్ శ్రీకర్ భరత్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు జక్కంపూడి గణేష్. కఠోర సాధన ద్వారా ఏ రంగంలో నైనా రాణించగలమని భారత వికెట్ కీపర్,క్రికెటర్, బెంగుళూర్ రాయల్ చాలెంజ్ ప్లేయర్ కోనా శ్రీకర్ భరత్ యువ క్రీడా కారులకుసూచించారు. శుక్రవారంనాడు స్థానిక రాజమహేంద్రవరం ఆనంద్ రీజెన్సీ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన జక్కంపూడి ప్రీమియర్ లీగ్ లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో భారత క్రికెటర్ భరత్ ముఖ్యఅతిథిగా పాల్గొని జెర్సీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భారత క్రికెటర్ భరత్ మాట్లాడుతూ యువ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు జక్కంపూడి ప్రీమియర్ లీగ్ లాంటి టోర్నమెంట్లు యువతకు ఎంతో ఉపయోగకరమని అన్నారు. జక్కంపూడి ప్రీమియర్ లీగ్ - 2022, టి -20 టోర్నమెంట్ జనవరి 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజీలో జరుగుతాయని తెలిపారు.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి 16 జట్టు లు పాల్గొంటాయని వివరించారు. భారతదేశం తరఫున క్రికెట్ ఆడడం గొప్ప అదృష్టంగా భావిస్తానని పేర్కొన్నారు. వరల్డ్ కప్ క్రికెట్లో పాల్గొనే అవకాశం వస్తే తప్పకుండా వరల్డ్ కప్లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తానని తెలిపారు.అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జక్కంపూడి ప్రీమియర్ లీగ్ 2022 , టీ -20 టోర్నమెంట్లో క్రికెట్ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రధానం చేయడం జరుగుతుందని అన్నారు.కరోనా విపత్కర పరిస్థితుల్లో జక్కంపూడి రామ్మోహన రావు పౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి ఎందర్నో ఆదుకోవడం జరిగిందని ఆయన తెలియజేశారు.క్రీడా నిర్వాహకులు జక్కంపూడి గణేష్ మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులు వెలుగులోకి తీసుకురావడం ఉద్దేశంతోనే జక్కంపూడి ప్రీమియర్ లీగ్ టోర్నీలను నిర్వహించడం జరుగుతుందన్నారు.క్రికెట్ పోటీలు ప్రాంతాలకు కులాలకు అతీతంగా క్రికెట్ ను ప్రేమించే క్రీడాకారులు ఈ ప్రీమియం లీగ్ లు పోటీలలో వినియోగించుకుని పై స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. తెలుగు తేజం కేఎస్ భరత్ దేశానికి గర్వించదగ్గ క్రికెటర్ గా ఎదగడం ఆంధ్రప్రదేశ్ కు గర్వకారణమని అన్నారు. సింపుల్ గా ఉండటమే తనకు శ్రీరామరక్ష అని తాను క్రీడల్లో రాణించి దేశానికి పేరు తీసుకురావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్లు మూర్తి, మురళి, శ్రీను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నక్క శ్రీ నగేష్, బొంతా శ్రీహరి, ప్రభాకర్, ప్రసాద్, శ్రీను, ఆనంద్, వజీర్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల క్రికెట్ క్రీడాకారులు పాల్గొన్నారు.