ఒమిక్రాన్ ప్రచారాన్ని నమ్మొద్దు శ్రీకాకుళం కలెక్టర్ శ్రీకేష్ క్లారిటీ

TV77తెలుగు శ్రీకాకుళం :

ఆంధ్ర ప్రదేశ్ లో ఒమిక్రాన్ కేసు నమోదైంది అంటూ ప్రచారం జరిగింది. దీనిపై కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ క్లారిటీ ఇచ్చారు. సంతబొమ్మాళి మండలంలో ఒమీక్రాన్‌ కేసు నమోదైనట్లు మీడియా, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాంలో నిజం లేదని కలెక్టర్ చెప్పారు.సంతబొమ్మాళి మండలం ఉమిలాడ గ్రామానికి చెందిన దక్షిణాఫ్రికా నుంచి వచ్చారని గత నెల 22న ముంబైలో పరీక్షలు చేయగా నెగిటివ్‌ వచ్చిందని.మళ్లీ 23న సొంత ఊరికి వచ్చారన్నారు. మళ్లీ ఆయన్ను పరీక్షించగా నెగిటివ్‌ రిపోర్ట్‌ వచ్చిందని.డిసెంబర్ 5న ఆ వ్యక్తికి టెస్ట్ చేస్తే పాజిటివ్‌ నిర్దారణ జరిగిందన్నారు. ఆ వ్యక్తి శ్యాంపిల్స్‌ను జినో సీక్వెన్సింగ్‌కు పంపించామన్నారు కలెక్టర్.నివేదిక రావడానికి వారం రోజుల సమయం పడుతుందని.ఆ రిపోర్ట్ రాగానే ఏ వేరియంట్‌ నిర్ధారణ జరుగుతుందన్నారు. ఆ తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.ఇప్పుడే ఓమిక్రాన్‌ గా నిర్దారణ చేయలేమన్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని. ప్రస్తుతం ఆ ప్రాంతంలో కంటైన్మెంట్‌ జోన్‌గా ఏర్పాటు చేశామని తెలిపారు.ఆ వ్యక్తికి కరోనా స్వల్ప లక్షణాలే కనిపించడంతో హోం ఐసొలేషన్‌లో ఉంచారు. ఆయన డిసెంబర్ 9వ తేదీన జరిగే కూతరు పెళ్లి కోసం వచ్చారు.పాజిటివ్ రావడంతో ప్రస్తుతం పెళ్లి వాయిదా వేసినట్లు తహసీల్దార్ వెల్లడించారు.