రాజమండ్రి పార్లమెంట్ కార్యాలయం లో క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న నగరి శాసనసభ్యులు రోజా సెల్వమణి


 TV77 తెలుగు రాజమహేంద్రవరం :

రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి.

 రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు, వైస్సార్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్  ఆధ్వర్యంలో ముఖ్యఅతిధిగా నగరి శాసనసభ్యులు  ఆర్.కె.రోజా సెల్వమణి. ముఖ్యఅతిధిగా పాల్గొని క్రిస్మస్ కేక్ ను కట్ చేసి వేడుకలను వైస్సార్సీపీ రాజమహేంద్రవరం కుటుంబ సభ్యుల మధ్య జరుపుకున్నారు. ఎమ్మెల్యే రోజా  మాట్లాడుతూ క్రీస్తు జన్మదినం వేడుకలు ఇక్కడ జరుపుకోవడం చాలా ఆనందముగా ఉందని, రాష్ట్రప్రజలు అందరూ సుఖశాంతులతో సంతోషముగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ఎంపీ భరత్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ భరత్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ఎమ్మెల్యే రోజా కి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ 2021 క్రిస్మస్ వేడుకలను తన జీవితంలో మర్చిపోలేనని, రాష్ట్ర ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం  నగర మరియు రూరల్ లోని పార్టీ శ్రేణులు, వివిధవిభాగల కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, వార్డ్ ఇంచార్జిలు, నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.