TV77తెలుగు అనంతపురం క్రైమ్ :
జిల్లా గుమ్మగట్ట మండలం గోనభావి గ్రామ సమీపంలో ఆటోను జీపు ఢీకొంది. హులిగి నుండి కోడిపల్లికి వెళుతున్న ఆటో గోనబావి నుంచి రాయదుర్గంకి వస్తున్న జీపు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. గాయపడినవారందరినీ 108 వాహనంలో రాయదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించిన అనంతరం గాయపడిన బాలుడు రాము, మహిళ రూపా, మరొకరిని మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు బ్రహ్మసముద్రం మండలం వెస్ట్ కోడిపల్లి గ్రామానికి చెందిన శేఖర్ (26), నాగమ్మ (60), రష్మిత (5), మహేందర్ (4) లుగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులు లక్ష్మి, రూపా, రాము, ప్రతాప్ రెడ్డిలుగా గుర్తించారు.