TV77తెలుగు హైదరాబాద్ :
తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే రెండు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉపరితల ద్రోణి నైరుతి రాజస్థాన్ పరిసర ప్రాంతాల నుంచి విదర్భ మీదుగా ఉత్తర తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టానికి సుమారు 1.5 కిమీ ఎత్తు వరకు విస్తరించి ఉందని వెల్లడించారు. దీంతో కింది స్థాయి గాలులు ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణ వైపు వీస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో బుధ, గురువారాల్లో ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని,