TV77 తెలుగు రాజమహేంద్రవరం :
అర్హులకు మాత్రమే ఉచిత పధకాలు అమలు చేయాలి.
ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకుంద్దాం ! రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కు పునాదులుగా నిలుద్దాం.
పైరవీల ద్వారా పాలనను కలుషితం చేస్తున్న విశ్రాంతి ఉద్యోగుపై నిఘా పెట్టాలి.
భద్రత గల పాలనా సంస్కరణలు అత్యవసరంగా ప్రవేశపెట్టాలి .
ప్రత్యేక నిఘా ద్వారా విశ్రాంతి ఉద్యోగుల కదలికలపై ద్రుష్టి సారించాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్పిసి)ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి వారాంతపు సమావేశంలో ఆర్పిసి వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ కోరారు. నేటి రాజకీయ సమాజం అనర్హులతో గబ్బు కొడుతుందని, తాత ముత్తాల పేర్లు, కుల సంఘాల పేర్లు చెప్పుకుంటు ప్రస్తుత రాజకీయాల్లో చొక్కా ఎగుర వేస్తున్నారని, ప్రజా సేవ పట్ల గాని, సామాజిక అంశాల పట్ల గాని కనీస అవగాహన లేకుండా అధికారికంగా పెద్దలలు, ముని పెద్దల కోటాలో నేరుగా చట్ట సభల్లోకి ప్రవేశిస్తు పాలనా వ్యవస్థను, ప్రజా స్వామ్యాన్ని కూని చేస్తున్నారని, పాలన గాడితప్పుతుందని, నిరంతరం శాంతి భద్రతల సమస్యలతో ప్రజలు అల్లాడి పోతున్నారని, అభివృద్ధికి నోచుకోని ఆంధ్రప్రదేశ్ గా అడుగంటి పోతుందని, రాజకీయ ఆనిచ్చితిని, పాలనా కాలుష్యాన్ని బూచిగా చూపిస్తు రాష్ట్ర వనరులును పాలకుల ఆశీస్సులతో కార్పొరేట్లు దోచుకు పోతున్నారని, రాష్ట్రం లో కనీస వసతులు, మౌలిక సదుపాయాలుకు నోచుకోని విధంగా ప్రజలు హీనాతి హీనంగా జీవిస్తుంన్నారని,
అంకిత భావం అనుభవం గల ప్రజా ప్రతినిధులు నేడు కరువయ్యారని, పెద్దల మరణంతోనో, పెద్దలు, ముని పెద్దల పేర్లు చెప్పుకునో, అక్రమ సంపద తోనో, కిరాయి ప్రచారాలతోనో నేడు కలుషిత రాజకీయాలు శాసిస్తున్నారని, వాడు కాకపోతే వీడు, వీడు కాకపోతే వాడు అన్నట్టు రాజకీయ వారసులు వ్యవస్థ, ఆర్ధిక రంగాన్ని బ్రష్టు పట్టిస్తున్నారని, తాత ముత్తాతలు సంపాదించిన ఆక్రమ ఆస్తులు పంచుకున్నట్టే ప్రజా స్వామ్యాన్ని సైతం వ్యాపార పరంగా పంచుకోవటం ముందు తరాలకు మంచి పరిణామాలు కావని, ఏపిలో గల కార్యోన్ముఖులందరు ఒక్కత్రాటి పైకి వచ్చి వారసత్వ రాజకీయాలను భూస్థాపితం చేయాలని, నూతన రాజకీయ నిర్మాణాన్ని స్వాగతించాలని ఆయన పిలుపు నిచ్చారు. ఏ అంగవైకల్యం లేకపోయినా, దీర్ఘకాలిన అనారోగ్య సమస్యలు లేకపోయినా రాజకీయ స్వార్థ ప్రయోజనాలకై ఉచిత పథకాలకు ప్రజలను బానిసలుగా మారుస్తున్నారని, ఒక ప్రక్క ఉచిత పధకాలు ఇస్తు మరో ప్రక్క ఇష్టాను సారం ధరలు పెంచి ప్రజలను ప్రభుత్వాలు నిట్ట నిలువునా దోచుకుంటున్నాయని, నేటి పాలనలో దొంగకు దొరకు అర్ధం తెలియకుండా పోయిందని, పాలకుల అధికార దర్పణానికి యువత మత్తుకు బానిసలుగా మారిపోతున్నారని, 25 ఏళ్ల కే యువతరం అంతరించిపోయి కదలలేని కుత్రిమ వృద్దాప్యంతో మానశిక వికలాంగుల వలే జీవిస్తున్నారని,రాష్ట్ర ఖజానాను రాజకీయ అవసరాలకు దారి మళ్లించటం కారణంగా విపత్తులతో సైతం ప్రభుత్వాలు ప్రజలకు అండగా నిలువ కుండా ప్రజల కష్టాలను, అవసరాలను ఖరీదైన వ్యాపారంగా మార్చుకుంటున్నాయని, ప్రభుత్వాలే వ్యాపార మాఫియాలకు అండగా నిలుస్తున్నాయని, వికలాంగులకు, నిరుపేద వృద్దులకు, కటిక పేదలకు మాత్రమే ఉచిత పధకాలు అమలు చేయాలని, అర్హులకు ఉపాధి మార్గాలను అభివృద్ధి పరచి రాష్ట్ర ఆర్ధిక రంగాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని, ఏపిలో గల అపార ఖనిజ సంపదను, వనరులను, రాష్ట్రంలో గల అవకాశాలను మెరుగైన ఉపాధి మార్గాలుగా మార్చే విధంగా పాలకులు కృషి చేయాలని, త ద్వారా నిరుద్యోగ సమస్యను పారద్రోలాలని ఆయన తెలిపారు . కీలకమైన ప్రభుత్వ ఉన్నత స్థానాల్లో పనిచేస్తు వందల కోట్ల అక్రమార్జనతో విశ్రాంతి ఉద్యోగులు రాజకీయ నేతలుగా మాయల ఫకీర్ అవతారాలు ఎత్తు తున్నారని, ప్రతి ప్రభుత్వ శాఖల్లో ఈ తరహా మాయల ఫకీర్ లు పాలనను కలుషితం చేస్తున్నారని,విధుల్లో ఉన్నప్పుడు గల సన్నిహిత సంబంధాలుతో పైరవీలు నడిపిస్తు అక్రమార్కులకు లేని హక్కులు కల్పించే విధంగా అధికార దుర్వినియోగ చర్యలకు పాల్పడుతూ అర్హులు బాధితులుగా మిగిలి పోతున్నారని, విశ్రాంతి ఉద్యోగులు, వారి సన్నిహిత ఉద్యుగులు కారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో రికార్డులకు భద్రత లేకుండా పోయిందని, ఎక్కువ శాతం విశ్రాంతి ఉన్నత స్థాయి ఉద్యోగులు పాలనా దళారులుగా పరిపాలనను కలుషితం చేస్తున్నారని, ఈ మాయల్ ఫకీర్ దళారుల కారణంగానే న్యాయస్థానాల్లో లెక్కకు మించి వాజ్యాలు పేరుకు పోతున్నాయని, ఈ తరహా నేరగాళ్లపై ప్రభుత్వాలు నిఘా వ్యవస్థలు ద్వారా ప్రత్యేక మైన రహస్య దర్యాప్తు జరిపిస్తు తగిన చర్యలు చేపట్టాలని, ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాలపై విశ్వాసాన్ని పెంచాలని, ప్రస్తుతం అమలులో వున్న బూజుపట్టిన పాలనా విధానాల్లో నేటి పరిస్థితులుకు అనుగుణంగా సంస్కరణలు చేపట్టి పటిష్ట మైన పాలనా భద్రత అమలుచేయాలని ఆయన పేర్కొన్నారు. వారసత్వ రాజకీయాలను, ప్రభుత్వ అవినీతి పైరవీ కారులకు నేటితరం అడ్డుకట్ట వేయకపొతే సామాజిక తిరుగుబాటు తప్పదని ఆర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ హెచ్చిరించారు. సభకు ఆర్పిసి నగర సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత
వహించారు. ఈ సమావేశంలో ఆర్పిసి సెక్యులర్స్ సర్వశ్రీ లంక దుర్గా ప్రసాద్ , దుడ్డె త్రినాధ్ది, ఎండి హుస్సేన్త, దుడ్డె సురేష్ , వర్ధనపు శరత్ కుమార్ , దోషి నిషాంత్ , కొల్లి సిమ్మన్న, వాడపల్లి జ్యోతిష్ , పిల్లాడి ఆంజనేయులు , పడిశెట్టి ప్రసాద్, ద్వాదశి శ్రీనివాసరావు, మాసా అప్పాయమ్మ, నాగురి అన్నపూర్ణ, ముడపాక రామకృష్ణ , మేకల కిరణ్ కళ్యాణ్ , పిల్లా గణేష్ తదితరులు పాల్గొనియున్నారు.
మేడా శ్రీనివాస్,
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్