బంగారం ధర నేడు నిలకడగా


 బంగారం ధర నిలకడగానే కొనసాగింది. నిన్న స్థిరంగా కొనసాగిన పసిడి ఈరోజు కూడా అదే దారిలో నడిచింది. బంగారం ధర నేడు కూడా స్థిరంగానే ఉంది. పసిడి రేటులో ఎలాంటి మార్పు లేదు. బంగారం ధర నిలకడగా ఉంటే వెండి రేటు మాత్రం పడిపోయింది. గ్లోబల్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం బంగారం ధర స్థిరంగానే ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో బంగారం ధర రూ.48,830 వద్దనే కొనసాగుతోంది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.44,760 వద్ద నిలకడగా ఉంది. బంగారం ధర నిలకడగా కొనసాగితే.. వెండి రేటు మాత్రం మాత్రం పడిపోయింది. 3 రోజులుగా పెరుగుతూ వచ్చిన వెండి రేటు ఈరోజు రూ.600 పడిపోయింది. దీంతో కేజీ వెండి  సిల్వర్ ధర రూ.65,000కు క్షీణించింది. వెండి పట్టీలు, కడియాలు కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. ఔన్స్‌కు 0.05 శాతం ఎగసింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1785 డాలర్లకు చేరింది. వెండి రేటు కూడా జిగేల్ మంది. ఔన్స్‌కు 0.04 శాతం పెరుగుదలతో 22.52 డాలర్లకు ఎగసింది. గోల్డ్ రేటుపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపుతాయని గమనించాలి.