రహదారిపై పెద్ద బండరాళ్లు


  TV77 తెలుగు తిరుమల :

 రెండవ ఘాట్ రోడ్డు కొండచరియలు విరిగిపడ్డాయి. దారిలోని లింక్ రోడ్డుకు సమీపంలోని రహదారిపై పెద్ద బండరాళ్లు అడ్డంగా పడిపోయాయి. దీంతో రెండవ ఘాట్ రోడ్డు తాత్కాలికంగా మూసివేశారు. ఈ ఘటన సమయంలో ఓ ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. రోడ్డుపై అడ్డంగా రాళ్లు పడటం వల్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది. కొండచరియలను టీటీడీ విజిలెన్స్,ఇంజనీరింగ్,అటవిశాఖధికారులు తొలగిస్తున్నారు.