ఆటో బోల్తా వ్యక్తి మృతి


   TV77తెలుగు  అనంతపురం:

ధర్మవరం మండలంలోని మోటమొర్ల వంక వద్ద రోడ్డు తెల్లవారుజామున ఎద్దుల బండిని తప్పించబోయి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగ..ఆటో డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పో్లీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు నిమ్మలకుంట గ్రామానికి చెందిన వెంకటేశ్‎గా పోలీసులు గుర్తించారు.  కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.