ఆ ప్రెస్ క్లబ్ కు కోర్టు కేసులకు - ఎన్నికలకు లింకేమిటి?


 TV77తెలుగు రాజమహేంద్రవరం : 

ప్రెస్ క్లబ్ భాగోతం-2

కోర్టు కేసులకు - ఎన్నికలకు లింకేమిటి?

  దేశంలోను, ఎన్నో రాష్ట్రాల్లోను, మన రాష్ట్రంలోనే స్థానిక సంస్థలకు కరోనా మహమ్మారిని పక్కన పెట్టి యదేచ్ఛగా ఎన్నికలు జరిగి ప్రజాస్వామ్య విలువలను పట్టం కట్టాయి. అలాంటిది సముద్రంలో కాకిరెట్ట లాంటి రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఎంత ? ఈ సంస్థలోని సభ్యులు ఎంతమంది ? పట్టుమని ఎన్నికలు జరపాలని చిత్తశుద్ధి పదర్శిస్తే యధావిధిగా ఒక్కరోజులో పూర్తిచేసే వీలుంది. ఈ సంగతి క్లబ్ పెద్దలకు,సభ్యులకు తెల్సినప్పటికీ ఎవరూ పూనుకోరు. ఎందుకంటే ఎవడి స్వార్ధ ప్రయోజనాలు వారి కుండటమే కారణం. ఎన్నికలు జరపాలని ఏ సభ్యుడు బహిరంగంగా డిమాండ్ చేయడు. ఎన్నికలు జరిపిద్దామని పెద్దలు గానీ, ప్రస్తుత కార్యవర్గం గానీ ఆలోచించదు. ఎందుకంటే ప్రతి సభ్యుడు ఏదోక దందానో , చందానో, మామూళ్లు నో వసూళ్ళ చేసుకుంటూ పొట్ట పొషించుకుంటున్న వారే కావడం అందరికీ తెలిసిందే. ఇక పెద్దలు , కార్యవర్గం సైతం క్లబ్ పేరు చెప్పి మా వెనుక వందలాది విలేకరులున్నారని మద్యం, ఇసుక సిండికేట్లు వద్ద, రాజకీయ, ప్రభుత్వ అధికారుల వద్ద లాబియింగ్ చేస్తూ లక్షల రూపాయల వసూళ్ళకు పాల్పడుతూ వచ్చిన ఆదాయ వ్యయాలపై లెక్కా పత్రాలు జమ చేస్తున్నారో ! లేదో తెలియదు. లేదా పంచుకుంటున్నరా ! లేదో తెలియని గందరగోళం నెలకొంది. గత నాలుగేళ్ళుగా ప్రెస్ క్లబ్ ఎన్నికలు జరపకపోవడానికి కోర్టులో కేసులున్నాయని, ఎవరో రూ. నాలుగు లక్షలు ఫ్రీజింగ్ చేశారని ప్రస్తుత సారథి కార్యవర్ధం దాటవేత ధోరణి అవలంబించడాన్ని మెజార్టీ సభ్యులు లోలోపల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి, ఎవరూ ఎవరిపై (సంస్థ) కేసు వేశారు ? ఎందుకు ఏ ఆంశం పై వేసారు ? ఈ కేసుల వెనుక బాధ్యులు ఎవరు? కోర్టు కేసులకు క్లబ్ ఎన్నికలకు సంబంధం ఏమిటి? మెజార్టీ సభ్యుల కి సంబంధం ఏమిటి ? కేసు తేలేంత వరకు ఎన్నికలు జరపకూడదని కోర్టు ఏమైనా ఆర్డర్ ఇచ్చిందా? లేదు అలా ఇవ్వనప్పుడు ఎన్నికలు జరపకుండా నిలిపివేస్తున్న హక్కు ఎవరికుంది? కోర్టుకు వెళ్ళింది ఎవరూ ? ప్రతివాదులు ఎవరు ? ఇత్యాది సందేహాలు ప్రతి సభ్యుడిలోను నెలకొన్నాయి. అయితే ప్రతివాడు ప్రక్కనున్న వారితో ప్రెస్ క్లబ్ ఆరాచకాలపై గంటలకొద్ది ఉపన్యాసాలు ఇవ్వటం మినహా ఏ ఒక్కడూ అనధికార కార్యవర్గాన్ని మాత్రం ప్రశ్నించలేరు ?  నిలదీయలేరు ? ఎందుకంటే పైన చెప్పినట్టు ఎవడి స్వప్రయోజనాలు వారి కుండటమే కారణంగా పలువురు భావిస్తున్నారు. కోర్టు కేసులకు సంబందించి పూర్వ పరాలు, ఎవరూ బాధ్యులు తదితర అంశాలను చర్చించేందుకు సర్వసభ్య సమావేశం ఏర్పాటుచేయడం గాని భవిష్యత్ కార్యచరణపై చర్చించడంగాని నేటి దొడ్డిదారి కార్యజవర్గం నాలుగేళ్ళుగా కనీస ప్రయత్నం చేసిన పాపాన పోలేదని, వీరు దురుద్దేశ్యపూర్వకంగానే కాలయాపన చేస్తున్నారని, దీని వెనుక క్లబ్ ఆదాయాన్ని దిగమింగడానికేనని సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆర్యాపురం బ్యాంకులో నిల్వఉండి పోయిన రూ.4 లక్షల రూపాయలను విత్ డ్రా చేయకుండా, ఖాతాలో జమచేసుకునే వీలున్నప్పటికీ కోర్టు కేసు బూచీ చూపించి కొత్తగా మరో బ్యాంకులో ఖాతా ప్రారంభించి లావాదేవీలు నడపడడం,  ఆదాయ, వ్యయాలపై జవాబుదారితనం పాటించని సారధి కార్యవర్గం తెంపరితనంపై సభ్యులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. పాత ఖాతాలో ఉన్న రూ. 4లక్షల రూపాయలను తమకు (క్లబ్) వినియోగించకుండా ఆర్యాపురం బ్యాంకు అధికారులకు వ్రాత పూర్వకంగా మాజీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రాజు చేసిన పిర్యాదును ఉపసంహరించుకోవాలని, అనామత్తు కార్యవర్గం షరతు విధించడం వెనుక ఈ సొమ్మును స్వాహాచేయడానికేనని కొందరు సభ్యులు అనుమానం పడుతున్నారు. నిలిచిపోయిన రూ. 4లక్షలు తిరిగి క్లబ్ వినియోగంలోకి రావాలంటే క్లబ్ సర్వసభ్యసమావేశం నిర్వహించి తీర్మానం చేసి బ్యాంకు అధికారులకు అందచేస్తే నిలిచిన నగదు లావాదేవీలను కేవలం నాలుగు నిమిషాల్లో పునరుద్ధరిస్తామని బ్యాంకు పాలకవర్గం స్పష్టంచేసిన సంగతి విదితమే. అయితే, ఈ దిశగా గత నాలుగేళ్లుగా సర్వసభ్య సమావేశం నిర్వహించాలని చిత్త శుద్ధి ప్రదర్శించడం ప్రస్తుత కార్యవర్గానికి ఇష్టంలేని వ్యవహారం. అలాచేసినట్లయితే వారి గొయ్యి వారే తవుకున్నట్లేనని, మెజార్టీ సభ్యుల ఆగ్రహావేశాలను, అసంతృప్తిని, వ్యతిరేకతను చవిచూడాల్సివస్తుందని,క్లబ్ పెద్దలు, కార్యవర్గం భయపడుతున్నారని తెలుస్తోంది. గత నాలుగేళ్ళుగా అనధికారికంగా తిష్టవేసి సభ్యుల మనోభావాలను తుంగలో తొక్కుతున్న కార్య వర్గం తీరుతెన్నులను ఎండగట్టలని పలువురు కోరుతున్నారు.

ఇది ఫార్వర్డ్ వార్త : నిజానిజాలు తెలియల్సి ఉంది.