గ్రామాల్లో గ్రైండర్ బురిడీ రాజ..!!!


 TV77 తెలుగు ఇబ్రహీంపట్నం:

మిక్సర్ గ్రైండర్లు అమ్మకానికి పర్సనల్ లోన్ ఎర చూపిన మార్కెట్ రాజ...!!

లోన్ల పేరుతో 2800 విలువ చేసే మిక్సర్ గ్రైండర్ ను 3800 కు అమ్మి సొమ్ము చేసుకున్న కేటుగాడు....!!

లోన్ ఇవ్వకపోవడం తో మోసపోయామని భావించి పోలీసులను ఆశ్రయించిన మహిళలు....!!

ఇబ్రహీంపట్నం, గుంటుపల్లి, కొండపల్లి లో గ్రైండర్ రాజ బాధితులు...!!!

కేసు నమోదు చేసిన ఇబ్రహీంపట్నం పోలీసులు...!!

గృహిణి అవసరాలను టార్గెట్ చేసుకొని ఒక కేటుగాడు మాస్టర్ ప్లాన్ వేశాడు. తన మార్కెటింగ్ మేధస్సుకు పదును పెట్టీ గ్రామాల్లో మహిళలలకు తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పిస్తానని నమ్మబలికి తన వ్యాపారాన్ని విస్తరించాడు.తన దగ్గర ఉన్న ఈ మిక్సర్ గ్రైండర్ లను సంఘాలుగా ఏర్పడి కొనుగోలు చేసిన వారికి 50వేలు మేర తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పిస్తానని నమ్మబలికి 2800 విలువ చేసే మిక్సర్ గ్రైండర్ లను 3800 లకు అమ్మేశాడు. లోన్ ఇస్తారు అన్నారు అని మహిళలు సైతం పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. రోజులు నెలలు గడుస్తున్నా లోన్ ఇవ్వకపోవడం తో మోసపోయామని గ్రహించిన మహిళలు పోలీసులను ఆశ్రయించారు.దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రిపోర్టర్, సత్య...మైలవరం