TV77 తెలుగు పెద్దాపురం:
అత్తిలి సీతారామ స్వామి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
ఉక్కు కర్మాగారం ఉద్యమంలో 32 మంది ప్రాణాలు బలి
పార్లమెంటు సమావేశాల్లో ఎంపీలు గళం వినిపించాలి
పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మండలం పి. వేమవరం గ్రామంలో పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో జన సేన పార్టీ నాయకులు అత్తిలి సీతారామ స్వామి గారు ఆధ్వర్యంలో జన సేన కార్యకర్తలు రోడ్డు షో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అత్తిలి సీతారామస్వామి మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ ఏకైక జాతీయ ప్రాజెక్టు విశాఖ ఉక్కు పరిశ్రమ అని దానికోసం ఆనాడు నాయకులు ఈ ఉద్యమంలో భాగంగా 32 మంది ప్రాణాలర్పించారని 26వేల ఎకరాల విస్తీర్ణంలో ఈ కర్మాగారం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని . దీనికి 10 వేలకోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహక రించింది. 1992 ఆగస్టు 8న అప్పటి ప్రధాని పి.వి.నరసింహారావుహొవిశాఖ ఉక్కు కర్మాగారాన్ని జాతికి అంకితం చేశారు. అటువంటి ఉక్కు పరిశ్రమ పై ఎందరో కార్మికులు ఆధారపడి ఉన్నారని జాతీయ హక్కు గల ఈ పరిశ్రమ ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం ఎంతవరకు సబబు అని ఆయన ప్రశ్నించారు. ఇదే అంశంపై రేపు జరగబోయే పార్లమెంటు సమావేశంలో కాకినాడ ఎంపి వంగా గీతా విశ్వనాధ్ గారు , రాష్ట్ర ఎంపీలు పార్లమెంటులో ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అంశం పై గట్టిగా గళం విప్పాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు ముసిరెడ్డీ వాసు, మేడిది గణేష్, యాళ్ళ శ్రీను, యాళ్ల బాబ్జీ,శ్రీపతి కాశీ,సింగం రాజు, కింతడా వీరబాబు, యాళ్ల దొరబ్బాయి,ఆచంట ఏసు తదితరులు పాల్గొన్నారు.