TV77తెలుగు కొయ్యలగూడెం:
కొయ్యలగూడెం విద్యాభివృద్ధిలో దేశంలోనే ఏపీ అగ్రగామిగా నిలిచిందనీ ఇది మనందరికీ గర్వకారణం అని రాజమండ్రి ఎంపీ మార్గాన్ని భరత్ పేర్కొన్నారు. టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, జడ్పీ చైర్మన్ కౌరు శ్రీనివాస్ లతో కలసి బుధవారం విచ్చేసిన నేపథ్యంలో ప్రకాశం డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థినులు నిర్వహించిన న్యూఇయర్ వేడుకలలో పాల్గొన్నారు. ప్రధాని ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్ (ప్రీప్రైమరీ విద్య) విడుదల చేసిన నివేదికలో మన రాష్ట్రం కేరళను అధిగమించి మొదటి స్థానం వహించింది అన్నారు. ఇప్పటివరకు పాఠశాల, హైస్కూల్ విద్య కు మాత్రమే పరిమితమైన జగనన్న విద్యా ఇకపై కళాశాలలకు కూడా విస్తరింప చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేక్ కట్ చేసి విద్యార్థులకు పంపిణీ చేశారు. టీటీడీ చైర్మన్, ఎంపీ,ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్,లకు విద్యార్థులు పూలవర్షంతో ఆహ్వానం పలికారు. కార్యక్రమంలో అంగర పృద్వి, చిటికెన నాగార్జున, మారిశెట్టి శ్రీను, తదితరులు పాల్గొన్నారు.