ఆ ప్రెస్ క్లబ్ లో నాలుగేళ్ళుగా ఎన్నికలు లేవు- లెక్కపత్రాలు లేవు


 

TV77తెలుగు రాజమహేంద్రవరం:

 ప్రెస్ క్లబ్ బాగోతం  - 1

 నాలుగేళ్ళుగా ఎన్నికలు లేవు- లెక్కపత్రాలు లేవు 

రూ.40 లక్షల ఆదాయం స్వాహా ?

రాజమండ్రి  రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మక క్లబ్  గా పేరుబడిన ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ (407/93) 

దశాబ్దల కాలంగా పలురకాల అవినీతి,ఆక్రమాలకు నిలయంగా మారింది. ఈ మధ్యకాలంలో ఒకటి, ఆరా కార్యవర్గాలు  మినహా, మిగతా కార్య వర్గాలన్ని  అక్రమాల బాట పట్టాయని సభ్యులు చేస్తున్న ఆరోపణలు వాస్తవమేనని మరోసారి పార్థసారధి కార్యవర్గం  నిరూపించింది. క్లబ్బుకు వచ్చిన  లక్షలాది రూపాయల ఆదాయం పాలకవర్గాల స్వార్థ ప్రయోజనాలకు  ఆలంబనగా చేసుకోవడం పరిపాటిగా మారిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్లబ్బు అభివృద్ధికి గాని,  సభ్యుల సంక్షేమానికి  గానీ పెద్దగా ప్రయోజనం చేకూర్చిన సందర్భాలు  లేవని విమర్శలు నెలకొన్నాయి. ఒకప్పుడు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర నాయకులు సైతం ప్రెస్ కాన్ఫరెన్స్ లు నిర్వహించాలంటే ఇక్కడ పనిచేసే విలేకర్ల ప్రశ్నలకు, వారి  నిర్మొహమాట వైఖరికి సంకోచించారనే  ప్రతీతి. అంటే ఆనాటి రోజుల్లో సబ్జెక్టు మీద, వృత్తి పట్ల అంకితభావం, నైతిక విలువలు ప్రదర్శించే వారు కావటంతో రాజమండ్రి ప్రెస్ క్లబ్ కు రాష్ట్రస్థాయిలో పేరు వచ్చిందనే తెలుస్తోంది. అయితే నేడు పాత్రికేయ రంగంలో సంఘ వ్యతిరేక శక్తులు రంగప్రవేశం

చేయడంతో పాత్రికేయ విలువలు బ్రష్టు పట్టియున్న వాదన కఠోరమైన వాస్తవం. ఇందుకు పాత్రికేయ సంఘాలు, మీడియా యాజమాన్య సంస్థలు, కొత్తతరం పాత్రికేయులు  స్వార్థమే పరోమార్తంగా, స్వప్రయోజనాలే లక్ష్యంగా పరస్పరం మనుగడ సాగిస్తుండడం సర్వత్రా కనిపిస్తున్నదే.

 ఇక రాజమండ్రి ప్రెస్ క్లబ్ సంగతి చూస్తే  క్లబ్ రిజిస్ట్రేషన్ మనుగడలో లేదు. 1993లో 407 గా కో ఆపరేటివ్ సొసైటీ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ జరిగినప్పటికీ 1998 నుండి నేటివరకూ సంవత్సరాల తరబడి ఆడిట్,  కార్యవర్గల తీర్మానాలు, రెన్యువల్స్ జరగగ పోవడంతో రిజిస్ట్రేషన్ డెడ్ అయ్యింది. దీన్ని పునరుద్ధరించడానికి మంత్రులు,  ఉన్నతాధికారుల  స్థాయిలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఈ నేపథ్యంలో మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంది. 

ఈ క్రమంలో 2018 లో దొడ్డిదారిన, ఏకపక్షంగా కూడిపూడి పార్థసారధి ఆధ్యక్షతన ఏర్పడిన కార్యవర్గం కాలపరిమితి ముగిసి నాలుగేళ్ళు పూర్తవుతుంది. నేటికి కొత్త కార్యవర్గం ఎన్నికలు లేవు, జనరల్ బాడీ సమావేశాలు లేవు. గత నాలుగేళ్లుగా క్లబ్ కు పలు రూపాల్లో వచ్చిన సుమారు రూ. 40 - 50 లక్షల రూపాయల ఆదాయానికి లెక్కపత్రాలు లేవు. జవాబుదారితనం లేదు. క్లబ్ అవిర్భావం నుండి కొనసాగిస్తున్న  ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ లోని ఖాతాను వర్గ విబేధాల క్రమంలో ఆర్థిక లావాదేవీలు నిలిపేసి, మరో బ్యాంకులో కొత్తగా ఖాతా తెరిచి లావాదేవీలు నిర్వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది.  దొడ్డిదారి పాలక వర్గ సభ్యులు,  మరి కొంతమంది ముఠాగా ఏర్పడి గత నాలుగేళ్లుగా  కుట్రలు , కుతంత్రాలు పన్నుతూ  ఎన్నికలు జరపకుండా సభ్యులను మోసపుచ్చుడమే కాదు. ఎన్నికలు జరపకుండా ప్రజాస్వామ్య విలువలను బ్రష్టు పట్టిస్తూ,  సమాజంలో  రుగ్మతలపై ప్రశ్నించే పాత్రికేయల ద్వంద విలువలపై ప్రజాసంఘాలు, రాజకీయ పక్షాలు ఎద్దేవా చేయడం చేస్తుండడం గమనార్హం.

ఏకగ్రీవంగా గాని, ఏకపక్షంగా గాని,  ఏలా గెలిచినప్పటికి,  ఏ కార్యవర్గమైనా ఏడాదిలో కార్యవర్గ సమావేశాలు, జనరల్ బాడీ సమావేశాలు సొసైటీ బైలా ప్రకారం తప్పనిసరిగా నిర్వహించాల్సి ఉంది. ఈ సమావేశంలో సభ్యులకు  ఆదాయ, వ్యయాలపై జమా లెక్కలు  విధిగా తెలపాల్సిన బాధ్యత ఉంది. అయితే ఈ దిశగా ,ప్రస్తుత సారధి కార్యవర్గం ఏనాడు ఎలాంటి ప్రయత్నం చేయకపోవడాన్ని సభ్యులు విమర్సిస్తున్నారు.  గత నాలుగేళ్ళుగా క్లబ్ ఆదాయాన్ని అందినకాడికి దండుకున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఆర్యాపురం బ్యాంకులో ఖాతా నిలిపే నాటికి రూ. 4లక్షలు రూపాయలు నిల్వ ఉన్నట్లు తెలుస్తోంది. మరి కొత్త ఖాతాలో ఎంత నిల్వ చేశారో ఎవరికి తెలియదు. క్లబ్ పెద్దలుగా చెప్పుకునే వారు గత నాలుగేళ్లుగా ఎన్నికలు జరపక పోవడం పైన,

ఆదాయ వ్యయాలపై లెక్కలు చెప్పకపోవడం పైన, సారధి కార్యవర్గాన్ని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారో ఎవరికి అంతుబట్టడం లేదు. బహుశా అనామత్తు కార్యవర్గం అవినీతి, అక్రమాల్లో  భాగస్వామ్యం అయ్యారమో అనే అనుమానాలు మెజార్టీ సభ్యులు వ్యక్తం చేయడం గమనార్హం.  వాస్తవానికి 1993 లో క్లబ్ ఏర్పాడే నాటికి ముందే నిసార్ధ సేవలు అందించిన త్యాగధనులున్నారు. 1993 తరువాత  ఎన్నికైన లేదా నేటి వరకూ  వచ్చిన కార్యవర్గాలు ప్రస్తుత మాదిరిగానే సంవత్సరాల తరబడి  అనధికారికంగా కొనసాగడం, నిధులు, ఆదాయాన్ని అందినకాడికి స్వాహాచేయడం, సభ్యులు తిరగబడడం, వర్గాలుగా విడిపోవడం, క్లబ్ కు తాళాలు వేయడం, పోలీసులు, కోర్టు కేసులు, అధికారులు, రాజకీయ నాయకుల వరకు వెళ్ళి పంచాయతీలు నెరవడం  అన్నీ జరిగి క్లబ్ పరుపు పోయిన దుస్థితిలో  ఎన్నికలు జరపడం/ కార్యవర్గాలు ఏర్పడ్డడం షరా మామూలుగా కొనసాగిన చరిత్ర ఉంది.  ఈ మద్యలో రామనారాయణ, లక్ష్మణస్వామి, కిరణ్ కుమార్ రాజు  అధ్వర్యంలో  ఏర్పడిన కార్యవర్గాలు అరకొర అవినీతి, అక్రమాల ఆరోపణలతో ఎలాగోలా వారు కుర్చీలు దిగారు.  గత నాలుగేళ్లుగా నిస్సిగ్గుగా కొనసాగుతున్న  సారధి కార్యవర్గాన్ని దిగిపోండని మెజారిటీ సబ్యులు డిమాండు చేస్తున్నప్పటికి తిష్ట వేయడాన్ని  పాత్రికేయులను, ప్రజా సంఘలను,  రాజకీయ పక్షాలను, అధికార వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. 

పోర్తు ఏస్టేట్ గా గొప్పలు చెప్పుకుంటున్న పాత్రికేయ రంగంలో రాజమండ్రి ప్రెస్ క్లబ్  ప్రస్తుత కార్యవర్గం తీరు ప్రజాస్వామ్య విలువలను, పాత్రికేయ విలువలను అపహాస్యం చేస్తున్నాదనే  విమర్శలు వస్తున్నాయి. ఇకనైనా రాజమండ్రి 

ప్రెస్ క్లబ్ వ్యవహారంలో  రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఉన్నత అధికారులు, జోక్యం చేసుకుని కొత్తగా కార్యవర్గ ఎన్నికలు జరిపించాలని,  జమా లెక్కలు తెలిపేలా తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

ఇది ఫార్వర్డ్ వార్త : నిజానిజాలు తెలియల్సి ఉంది.