TV77 తెలుగు భీమడోలు :
పశ్చిమగోదావరి జిల్లా. భీమడోలు శివారు గుండుగోలను - కొవ్వూరు జాతీయ రహదారిపై ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 9 మందికి గాయాలయ్యాయి. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను 108లో ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కారు విశాఖపట్నం నుండి విజయవాడ వెళుతుండగా ఘటన చోటు చేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు.