TV77 తెలుగు అయినవల్లి :
తూ.గో,లో ఒమైక్రాన్ కేసు నమోదైంది. అయినవల్లి మండలం నేదునూరి పెదపాలెంలో ఓమైక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈనెల 19వ తేదీన కువైట్ నుంచి విజయవాడ మీదుగా కారులో మహిళ వచ్చింది. గన్నవరం ఎయిర్ పోర్టులో కరోనా పరీక్షలు నిర్వహించగా ఓమైక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అప్రమత్తం అయిన అధికారులు, కుటుంబ సభ్యులకు మరోసారి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కోనసీమ వాసులు భయాందోళనకు గురవుతున్నారు.