TV77తెలుగు కొండపల్లి:
ఎన్నికల వ్యూహ రచన చేయడం తో పాటు ఎదుట వారి వ్యూహాలు పసిగట్టాలి.
ఇద్దరూ ఒకే స్థానం నుండి వేరే వేరే పార్టీల తరుపున ఎన్నికల బరిలో నిలిచారు. ఎలా అయిన గెలవాలి అని ప్రత్యర్థి ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాడు.కానీ రెండవ వాడు మాత్రం తానే గెలుస్తానని, మనం చేసిన మంచి గెలిపిస్తుందని ధీమా తో ఊగిపోయాడు.అయితే ఎన్నికల్లో గెలుపు తారు మారు అయ్యింది. ప్రత్యర్థి గెలిచాడు, ఇంకొకరు ఒడారు.ఇక్కడ ఓడిన వాడు గ్రహించాల్సిన చిన్న చిన్న లాజిక్ లు ఉన్నాయి.అవి అందరికీ పరిచయం చేయదలుచుకున్నాను. ఎన్నికల వేళ నేను గెలుస్తాను అని ప్రత్యర్థి 25 కట్టలు పందెం వేస్తాను అన్నాడట.ఇంకో అభ్యర్థి అక్కడ ఉన్న చిన్న లాజిక్ మిస్ అయ్యి నేను కూడ గెలుస్తానని పందానికి సిద్ధం అయ్యాడట. ఇక్కడే ప్రత్యర్థి తెలివిగా బుర్ర పెట్టీ ఆలోచన చేశాడు, తన రాజకీయ చతురతకు పదును పెట్టాడు. పోటీ లో ఉన్న ఇంకో అభ్యర్థితో 25 కట్టల పందెం వేసి అందులో ఒక పది కట్టలు నావి కాదు అనుకుని ప్రజలకు పంచేసి గెలుద్ధాం అనుకున్నాడట .ఆ విదంగా ఎలా గెలిచినా తనకు లాభం మే కదా అనుకుంటూ పక్కా స్కెచ్ వేసాడట. కానీ ఇంకో బాబు మాత్రం ఇంకో 25 కట్టలు తెచ్చి పందానికి సిద్ధం అయ్యాడు. గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నవాడు పందానికి సిద్ధం అయ్యి ప్రజలను వదిలేశాడు.ఎలా అయిన గెలవాలి అనుకున్న వాడు ఎదుట వాడి అజ్ఞానాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. తన అజ్ఞానం తో ఓడిపోయిన వాడు. తన ప్రత్యర్థి అంత ధీమా గా 25 కట్టలు కేవలం తాను గెలుస్తాననీ పందెం వేస్తున్నాడు అంటే వాడు గెలుపు కోసం ఏదో వ్యూహ రచన చేసే ఉంటాడు అని ఎందుకు గ్రహించలేదు.రాజకీయం అంటేనే చదరంగం.ఎన్నికలు అంటేనే పద్మవ్యూహం. ప్రత్యర్థి ఎత్తుకు పై ఎత్తు వేయగలిగితెనే రాజకీయాలలో విజయ అవకాశాలు ఉంటాయి.నా వెనుక పార్టీ ఉంది, నా వెనుక బలం, బలగం ఉంది కదా అని ఒంటెద్దు పోకడలు అనుసరిస్తే. ఓటమి అనే పరాభవం ఎదురు కాక తప్పదు. ప్రత్యర్థి తన విజయం పై ఎందుకు అంత నమ్మకంగా ఉన్నాడు అని ఒక ఆలోచన చేస్తే ఓటమి చవిచూడాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా రాజాకీయంగా పాఠాలు నేర్చుకోవడం మాత్రమే కాకుండా.ఎదురైన గుణపాఠాలు కూడా అర్థం చేసుకోవాలి.
అహం బ్రహ్మాస్మి..
ఎన్నికల పై ఊహాజనిత సందేశం.
సత్య..