పంచాయతీ పరిధిలో పెద్ద డ్రైన పూడికతీత పనులను పరిశీలించిన రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్


 TV77 తెలుగు రాజమండ్రి రూరల్ :

రాజమండ్రి రూరల్ నియోజకవర్గం హుక్కంపేట పంచాయతీ పరిధిలో పెద్ద కాలువ పూడికతీత పనులను స్థానిక నాయకులతో కలిసి చందన నాగేశ్వర్ పరిశీలించారు.గత నెలలో ఈ సమస్యను చందన నాగేశ్వర్ దృష్టికి  స్థానికలు తీసుకువొచ్చారు. చందన నాగేశ్వర్  రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వారితో మాట్లాడి డ్రైయిన్ పూడికతీతకు ఎస్టిమేషన్ వేయించి పనులు ప్రారంభం అయ్యేలా చందన నాగేశ్వర్  కృషి చేశారు. గురువారం ఉదయం కార్పొరేషన్ అధికారులు హుక్కంపేట డ్రైన్ పెద్ద కాలువ పనులను  ప్రారంభించారు.జరుగుతున్న పనలును చందన నాగేశ్వర్ స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు . ఈ కార్యక్రమంలో ముస్లిమ్ సంచారజాతుల కార్పొరేషన్ డైరెక్టర్ షకీలా బేగం, త్రిసభ్య కమిటీ  చైర్మన్ బొప్ప సుబ్బారావు,డైరెక్టర్ చీర రాజు, కురుమల ఆంజనేయులు,మీరవలి, షరీఫ్,పంపన అర్జునరావు, పంచాయతీ సెక్రెటరీ కాశీవిశ్వనాథ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.