విశాఖ ప్రేక్షకులకు అలరించిన సినీ సంగీత విభావరి


 TV77తెలుగు విశాఖపట్నం :

ప్రత్యేక ఆకర్షణ గా బొట్టా నాగేశ్వరరావు డోనాల్డ్ డక్ షో ఆర్టిస్ట్

విశాఖపట్నం మహానగరంలో స్థానిక పౌర గ్రంధాలయం నందు స్థిరవారం సాయంత్రం జరిగిన భువనేశ్వరి సినీ ఆర్ట్స్ సారథ్యం లో సినీ సంగీత విభావరి జాతీయ కళాకారులు డోనాల్డ్ డక్ షో ఆర్టిస్ట్ బొట్టా నాగేశ్వరరావు అద్వర్యంలో జరిగింది.ముఖ్య అధితిగా మాజీ డి.సి.పి ఖాన్,హ్యూమన్ రైట్స్ చైర్మన్ సంపత్ కుమార్, డి.సి.ఐ నాయుడు పాల్గొన్నారు.ఈ సందర్భంగా గాయని మణులు సింగర్స్ సుజాత,త్రివేణి, జోధా కొత్త పాత పాటలతో ఆలపించారు.
ఈ కార్యక్రమంలో డోనాల్డ్ డక్ షో ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది .ఈ సందర్భంగా గాయని సుజాత మాట్లాడుతూ విశాఖ సాగర తీరాన ప్రేక్షకులను  సాయంత్రం వేళ ప్రజలకు మరింత హాయిగా అనిపించే లా మా ప్రదర్శన ఉండటం చాలా సంతోషం, అలాగే మేము ఇటువంటి ప్రదర్శనలు చేయడం విశాఖ ప్రేక్షకులను అలరించడం చాలా తృప్తి నిచ్చింది ,కళాకారుల ప్రోత్సహం మంచి అవకాశంగా భావిస్తూ,ఈ సదవకాశాన్ని కల్పించిన బొట్టా నాగేశ్వరరావు కు ధన్యవాదాలు ఆమె తెలిపారు.ప్రముఖుల చేతుల మీదుగా గాయనిమణులను శాలువాలతో కప్పి చిరు సత్కరించారు.ఈ కార్యక్రమంలో సన్ మూర్తి,విశాఖ జూనియర్ నాగార్జున రవినాగ్,హాస్య అవార్డ్ గ్రహీత నాయుడు, నగర ప్రముఖులు, కళాకారులు , శ్రేయభిలాషులు,సంగీత విభావరి కి సౌండ్స్ అందించిన వారు మొల్లి శ్రీనివాసు, తదితరులు పాల్గొన్నారు.