చెడ్డి దొంగలేనా చిల్లర దొంగలా...??


 TV77 తెలుగు ఇబ్రహీంపట్నం:

ఇబ్రహీంపట్నం మండలం లో చెడ్డి గ్యాంగ్ హల్ చల్....!!!

గుంటుపల్లి లోని ఒక అపార్ట్మెంట్ లో చోరికి విఫల యత్నం....!!!

కర్రలు , రాడ్లతో అపార్ట్మెంట్ లోకి చొరబడిన వైనం....!!

ఘటన తో ఆందోళనలో ప్రజలు... మేము ఉన్నాము అంటున్న పోలీసులు....!!

ఇప్పటివరకు ప్రధానమైన మెట్రిక్ నగరాలకు పరిమితమైన చెడ్డీ గ్యాంగ్ ఇప్పుడు చిన్న చిన్న గ్రామాల్లో సైతం సంచరిస్తూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారు. కర్రలు రాడ్లతొ పెద్ద అపార్మమెంట్ లలోకి చొరబడి వీరంగం సృష్టించేందుకు విఫలయత్నం చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా గుంటుపల్లి గ్రామంలో చెడ్డి గ్యాంగ్ హల్ చల్ చేయడం స్థానికంగా సంచలనం సృష్టించింది. ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామం లోని ఒక అపార్ట్మెంట్ లోకి చొరబడిన చెడ్డి దొంగలు అపార్ట్మెంట్ వాసుల తెగువతో అక్కడి నుండి పరారైనట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఇక్కడ ఒక ఆసక్తికర విషయం ఏమిటంటే గతం లో చెడ్డి గ్యాంగ్ చేసిన చోరీలకు ఒకసారి పరిశీలిస్తే.వారు చేసే అరాచకం అంత ఇంత కాదు. ఆదొచ్చిన వారిని గాయపరిచి దొచుకువెల్లిన ఘటనలు ఉన్నాయి. అసలు చెడ్డి గ్యాంగ్ అపార్ట్మెంట్ లోకి ఎలా చొరబడ్డారు. అక్కడ ఉన్నవారు అందరూ ఒక్కటైతే చెడ్డి గ్యాంగ్ వారందరినీ నిలువరించగలరా.?? ఇప్పుడు ఇదే అంశం చర్చ నీయంశం అయ్యింది. ఊరి చివరన ఉండే బంగ్లా, ఇళ్లను టార్గెట్ చేసే చెడ్డి గ్యాంగ్ ఒక అపార్ట్మెంట్ లోకి చొరబడే సాహసం చేశారంటే వారు అసలు చెడ్డి దొంగలెనా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గుంటుపల్లి లో చొరబడింది చెడ్డి దింగలేనా. లేక చిల్లర దొంగలు చెడ్డి గ్యాంగ్ ముసుగులో వచ్చారా.?? అనేది పోలీసులు విచారణ లో తేలనుంది. అయితే ఒక్కసారిగా చెడ్డి గ్యాంగ్ హల్ చల్ చేయడం స్థానికంగా సంచలనం సృష్టించింది. సోషల్ మీడియా లో దొంగలు చొరబడిన వీడియో లు బయటకి రావడం తో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఒకసారి దొంగలు ప్రవేశించే తీరు ఒకసారి పరిశీలన చేస్తే వారు అసలు ఎవరు అనేది ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంది. ఏదీ ఏమైనా పోలీసులు మాత్రం భయపడాల్సిన పనిలేదు అంటూ ప్రజలకు భరోసా ఇస్తున్నారు..

రిపోర్టర్,సత్య..మైలవరం