పసిడి ప్రేమికులకు గుడ్ న్యూస్


TV77 తెలుగు :

బంగారం ధర వెలవెలబోయింది. ఈరోజు నేలచూపులు చూసింది. పసిడి కొనుగోలుదారులకు ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా పయనించింది. వెండి కూడా దిగొచ్చింది. తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని ప్రధాన నగరాల్లో బుధవారం గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం.ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.500 తగ్గుదలతో రూ.51,700కు పడిపోయింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.400 క్షీణతతో రూ.47,450కు తగ్గింది. వెండి రూ.500 తగ్గుదలతో రూ.61,400కు పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర పడిపోయింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.430 పడిపోయింది. దీంతో ఈరోజు రూ.49,420కు దిగొచ్చింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.400 తగ్గుదలతో రూ.45,300కు క్షీణించింది. వెండి రేటు విషయానికి వస్తే.. రూ.760 క్షీణతతో రూ.65,200కు పడిపోయింది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో బంగారం ధరల విషయానికి వస్తే.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.230 తగ్గుదలతో రూ.48,410కు క్షీణించింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.230 క్షీణతతో రూ.47,410కు తగ్గింది. వెండి రూ.500 తగ్గుదలతో రూ.61,400కు పడిపోయింది.  బెంగళూరు విషయానికి వస్తే. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం ధర రూ.430 తగ్గుదలతో రూ.49,420కు దిగొచ్చింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.400 క్షీణతతో రూ.45,300కు తగ్గింది. వెండి రూ.500 తగ్గుదలతో రూ.61,400కు పడిపోయింది. * విశాఖపట్నం, విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.430 పడిపోయింది. దీంతో ఈరోజు రూ.49,420కు దిగొచ్చింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.400 తగ్గుదలతో రూ.45,300కు క్షీణించింది. వెండి రేటు రూ.760 క్షీణతతో రూ.65,200కు పడిపోయింది.