TV77 తెలుగు ముంబై :
బాలీవుడ్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. మిర్జాపూర్ అనే వెబ్ సిరీస్‌లో లలిత్ పాత్రలో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ హిందీ నటుడు బ్రహ్మ మిశ్రా కన్నుమూశారు. ముంబైలోని వెర్సోవాలోని నటుడి ఫ్లాట్‌లో పోలీసులు మృతదేహాన్ని కనుగొన్నారు. నటుడు మిశ్రా మృతదేహాన్ని కూపర్ ఆసుపత్రికి శవపరీక్ష నిమిత్తం పంపినట్లు తెలిసింది. ఆయన మృతదేహాం పూర్తి కుళ్లిపోయే స్థితిలో ఉంది. నవంబరు 29న మిశ్రా ఛాతీ నొప్పితో బాధపడుతున్నారని, మందులు తీసుకున్న తర్వాత డాక్టర్ ఇంటికి పంపించారని తెలిసింది. ఆ తర్వాత గుండెపోటు కారణంగా ఆయన తుదిశ్వాస విడిచినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.