TV77తెలుగు రాజమహేంద్రవరం:
వాల్తేర్ డివిజన్ తో కూడిన రైల్వే జోన్ అమలు చేయాలి.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ కరణ ఆపాలి.
పక్కా రాజధాని నిర్మాణం తక్షణమే మొదలు పెట్టాలి.
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించాలి.
ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, 13 జిల్లాల అభివృద్దే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకోవాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్పిసి)ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి వారాంతపు సమావేశంలో ఆర్పిసి వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ప్రజలకు పిలుపునిచ్చారు. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి సాక్షిగా ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్ర విభజన ద్వారా జరిగిన నష్టం ను ప్రత్యేక తరగతి హోదా, విభజన చట్టం ప్రకారం అన్ని హామీలను అమలు పరుస్తాం అని నమ్మించి ఏపి ప్రజలను తీవ్రంగా వంచించారని, ప్రత్యేక హోదా సాధించి ఏపి ప్రజలకు అండగా నిలుస్తాం అని జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు కూడా మరో సారి నమ్మించారని, అవసరం అనుకుంటే హోదా సాధన కోసం రాజీనామా చేసి మోది సర్కార్ మెడలు వంచుతాం అని జగన్ సర్కార్ ఆనాడు ప్రకటించుకున్నారని, నేడు హోదా సాధన ఊసే మరిచి అప్పుడప్పుడు హోదా కోసం అడుగుతూనే వుంటాం అని రాజకీయ పబ్బం గడుపుతున్నారని, కేంద్ర ప్రభుత్వం ఏపి సర్కార్ ను కేంద్రంలో గల రాజకీయ అవసరాలకు బ్లాక్మెయిల్ చేస్తు ఏపి అభివృద్ధి పై కాలకూట విషం చిమ్ముతుందని ఆయన తీవ్ర విమర్శ చేసారు . కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చట్ట బద్దంగా ఇచ్చిన హామీలలో భాగంగా రైల్వే జోన్ హామీ ఒకటని, ఇప్పటి వరకు జోన్ ఇవ్వకపోగా వాల్టెర్ డివిజన్ ను తరలిస్తాం అని కేంద్ర ప్రభుత్వం సిగ్గు లేని ప్రకటన చేస్తున్నా ఏపిలో గల ప్రధాన అధికార, ప్రతిపక్ష పార్టీలు నిమ్మకు నీరెత్తి నట్లు వ్యవహరిస్తుందని, ఏపిలో గల బిజెపి రాష్ట్ర నాయకత్వం నర్తనశాల పాత్ర పోషిస్తు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని గుజరాత్ తదితర రాష్ట్రాలకు దోచిపెట్టుటకు కారకులుగా నిలుస్తున్నారని, ఏపిలో గల అపార ప్రకృతి ఖనిజ వనరుల సంపదను సైతం మోది సర్కార్ కార్పోరేట్ విదేశీ సంస్థలకు దోచిపెడుతున్నా ఏపిలో అధికార పక్షం మౌనంగా వుంటుందని, ప్రత్యేక హోదా ను యు టర్న్ చేస్తు ప్రత్యేక ప్యాకేజి అంటు ఏపి ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసిన చంద్రబాబు పై ప్రజలకు విశ్వాసం లేదని, రాజకీయ ఆధిపత్య పోరుకు ఏపి అభివృద్ధి క్షీణ దశకు చేరుకుంటుందని ఆయన తీవ్ర ఆవేదన చెందారు. ఆత్మ బలిదానాల తో సాధించుకున్న విశాఖ ఉక్కు ను మోది సర్కార్ ప్రైవేటీ కరణ చేసి మోది సర్కార్ కు పెట్టుబడి దారులుగా తెర వెనుక పాత్ర పోషిస్తున్న విదేశీ కంపెనీలకు దోచి పెట్టె విధంగా లక్షల కోట్లు విలువ గల ఆస్తులను కైవసం చేసుకునే కుట్రకు రాచమార్గం చేస్తున్నారని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ కారణకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలలో మోదికి భజన చేసేవారు, బిజెపి పార్టీకి సన్నిహితులు సైతం పాల్గొని సంగీభావం తెలపటం స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉద్యోగులు దురదృష్టం గా భావించాలని, ఏపి లో గల అనేక ప్రజా ఉద్యమాల్లో రాజకీయ కోవర్టులు కారణంగానే ఉద్యమ ఫలితం భాదితులకు చేరటం లేదని, రాజకీయ దళారులు లాభపడుతున్నారని,ప్రస్తుత ప్రధాన రాజకీయ పక్షాలను ప్రజలు సమూలంగా ప్రక్షాళన చేయాలని ఆయన కోరారు. రాష్ట్ర విభజన జరిగి 7 ఏళ్ల జరిగినా నేటికి విభజన హామీలను అమలు చేయక పోగా, ఏ ఒక్క అభివృద్ధి ని ఏపి ప్రజలు పొందలేక పోయారని, భారతదేశం లో పక్కా రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని,చంద్రబాబు రాజకీయ దురుద్దేశం తో తాత్కాలిక రాజధాని, తాత్కాలిక హైకోర్టు అని నాటిన విష బీజం నేటి జగన్ సర్కార్ కు వరంగా మారిందని, రాజకీయ కక్ష సాధింపులకు ఇచ్చుకునే ప్రాధాన్యత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల పాలకులు చూపలేక పోతున్నారని, పాలకులు ఉచిత పథకాలకు ప్రజలను మానశిక రోగులుగా మారుస్తు ఏపి ఆర్ధిక వ్యవస్థ ను పతనం చేస్తు మోయలేని ఋణబారం లోకి నెట్టేస్తున్నారని, కనీస వసతులు, మౌలిక సదుపాయాలు పట్ల పాలకులు దృష్టి సారించకుండా దుర్ఘంధంలో ప్రజలు జీవిస్తున్నారని, మత్తుకు యువతను బానిసలుగా మారుస్తున్నారని, 40 ఏళ్ళు దాటకుండానే నేటి పాలకుల స్వార్థానికి యువత జీవితాలు అంతరించి పోతున్నాయని, బాల్యాన్ని సైతం పాలకుల నిర్లక్ష్యానికి చిదిమేస్తున్నారని ఆయన తీవ్ర మనస్తాపానికి గురైయ్యారు. పోలవరం ప్రాజెక్ట్ ను జాతీయ ప్రాజెక్ట్ గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించి మొత్తం నిధులు కేంద్ర ప్రభుత్వమే బారాయిస్తుందని గొప్పలు చెప్పి ఇచ్చిన నిధులు చంద్రబాబు దారి మళ్లించారని ఒక సారి, నేడు జగన్ దారి మళ్లించారని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సోది కబుర్లు చెబుతు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పేరుతొ కాంట్రాక్టర్ల ముసుగులో కోట్లాది నిధులు రాజకీయ దళారులు, ప్రభుత్వ పెద్దలు దోచుకుంటున్నారని, కేంద్ర ప్రభుత్వం చోద్యం చూడటం తప్ప ఏ నాడు నిధులు కైంకర్యం చేస్తున్న వారిపై చర్యలు చేపట్టిన దాఖలాలు లేవని, చంద్రబాబు పాలనలో 70%, జగన్ పాలనలో 80% పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసాం అని చెప్పుకుంటున్నారు తప్ప ప్రాజెక్ట్ నిర్మాణం శూన్యం గానే వుందని, ఏపి అభివృద్ధి పట్ల కేంద్ర ప్రభుత్వానికి చిత్త శుద్ధి లేదని, అనేక బలహీనతలు గల చంద్రబాబు, జగన్ లు మోదికి బాంచన్ దొర అంటు రాజకీయ ప్రయోజనాలు పొందుతూ ప్రజల చెవిలో నిత్యం పువ్వులు పెడుతున్నారని ఆయన తీవ్ర ఆరోపణ చేసారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవం కోసం ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం తక్షణమే ఏపిలో గల 25 మంది ఎంపీలు రాజీనామాలు చేయాలని, ఏపిలో మార్పు తథ్యం అని, మార్పు తోనే ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, నేటి ప్రధాన రాజకీయ పక్షాలను ఏపిలో పూర్తి స్థాయిలో సంస్కరించుకోవాలని, లేకుంటే ఏపి లో ఆర్ధిక సంక్షోభం, శాంతి భద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం వుందని ఆర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ హెచ్చిరించారు. సభకు ఆర్పిసి సీనియర్ సెక్యులర్ పెండ్యాల దేవరాజ్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆర్పిసి సెక్యులర్స్ సర్వశ్రీ దుడ్డె త్రినాద్ , ఎండి హుస్సేన్, వల్లి శ్రీనివాసరావు, వర్ధనపు శరత్ కుమార్ వల్లి వెంకటేష్, పిల్లాడి ఆంజనేయులు తాడికొండ మణికంఠ కుమార్ , గొల్లపూడి సాగర్ , వాడపల్లి జ్యోతిష్, బత్తుల సూర్యనారాయణ, కోమర్తి గోపి శ్రీనివాసరావు, పివిఎస్ దుర్గాప్రసాద్, కొలిపిల్లి లక్ష్మణరావు, గోపాలపురపు గోపీచంద్ తదితరులు పాల్గొనియున్నారు.
మేడా శ్రీనివాస్, రాష్ట్రీయ ప్రజా